LSG vs MI : స్వల్ప ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)కు ఆదిలోనే షాక్. ఓపెనర్‌గా వచ్చిన కొత్త కుర్రాడు అర్షిన్ కులకర్ణి(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. నువాన్ తుషార వేసిన మొదటి ఓవర్లో ఎల్బీగా ఔటయ్యాడు. రివ్యూ తీసుకొని ముంబై అతడి వికెట్ సాధించింది. ఒక్క పరుగుకే ఒక వికెట్ పడడంతో కెప్టెన్ కేఎఎల్ రాహుల్(5), మార్కస్ స్టోయినిస్(5)లు జాగ్రత్తగా ఆడుతున్నారు. మూడు ఓవర్లకు లక్నో స్కోర్.. 11/1.
తొలుత ఆడిన ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) బౌలర్లు విజృంభించారు. ఒకదశలో 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై వందలోపే చాపచుట్టేలా కనిపించింది. అయితే.. ఓపెనర్ ఇషాన్ కిషన్(32), నేహల్ వధేరా(46)లు అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. చివర్లో టిమ్ డేవిడ్(35 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో పాండ్యా సేన లక్నోకు 145 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.