సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Aug 01, 2020 , 00:01:13

కో-ఆప్షన్‌లు టీఆర్‌ఎస్‌ ఖాతాలో..

కో-ఆప్షన్‌లు టీఆర్‌ఎస్‌ ఖాతాలో..

  • టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఓటు 
  • ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
  • పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి 

పరిగి : పరిగి పురపాలక సంఘంలో శుక్రవారం నిర్వహించిన కో-ఆప్షన్‌ ఎన్నికల్లో నాలుగు కో-ఆప్షన్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ కో-ఆప్షన్‌ ఎన్నికలు నిర్వహించారు. ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రసన్నలక్ష్మి, కౌన్సిలర్లు వాసియా తబసుమ్‌, అర్చనకుమారి, వేముల కిరణ్‌కుమార్‌, వార్ల రవీంద్ర, సమీనాబేగం, బొంబాయి నాగేశ్వర్‌రావు, ఖాజా బద్రుద్దీన్‌, గొల్ల రాములమ్మ, సయ్యద్‌ షబనూర్‌, జర్పుల శ్రీనివాస్‌, ఎదిరె కృష్ణ, ఎర్రగడ్డపల్లి అనుసూజ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన సానియాసుల్తానా, సోమారం పార్వతమ్మ, ముకుంద శేఖర్‌, షేక్‌ ముజామిల్‌ కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. సానియా సుల్తానాకు 10 ఓట్లు, సోమారం పార్వతమ్మ, ముకుంద శేఖర్‌, షేక్‌ ముజామిల్‌కు 11 ఓట్లు వచ్చాయి. దీంతో నలుగురు అభ్యర్థులు కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికైనట్లు కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 7వ వార్డు కౌన్సిలర్‌ టి.వెంకటేశ్‌ గైర్హాజరయ్యారు. ఇదిలావుండగా ముగ్గురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్‌ గొల్ల రాములమ్మ మద్దతు ప్రకటించారు.  

పరిగిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించారు. పరిగి మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికైన సానియాసుల్తానా, సోమారం పార్వతమ్మ, ముకుంద శేఖర్‌, షేక్‌ ముజామిల్‌లను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్‌ అభివృద్ది కోసం మంత్రి కేటీఆర్‌ రూ.15కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులతో అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని చెప్పారు. మరో రూ.5కోట్లతో మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణం చేపడుతామని పేర్కొన్నారు. మున్సిపల్‌ నిధులతో అన్ని వార్డుల్లో అభివృద్ధ్ది పనులు చేపట్టాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మరింత ప్రణాళికాబద్దంగా నిర్వహించి సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సూచించారు. కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్‌ అభివృద్ధికి తనవంతుగా నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. logo