e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home జిల్లాలు విద్యా రంగానికి పెద్దపీట

విద్యా రంగానికి పెద్దపీట

హామీలు నెరవేర్చే సీఎం కేసీఆర్‌
డిగ్రీ కళాశాలతో పేద విద్యార్థులకు మేలు
పరిగిలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు

పరిగి, జూలై 31 : ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు శనివారం పట్టణంలోని తెలంగాణ అమరవీరుల క్రాస్‌రోడ్డులో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్‌ నెరవేరుస్తున్నారని తెలిపారు. పరిగిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత విద్యార్థుల కల నెరవేరిందన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివే అవకాశాలు కలిగాయని, ఈ సంవత్సరం నుంచే పరిగిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభం అవుతుందని చెప్పారు. పాలమూర్‌-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని, తద్వారా రాబోయే కొద్ది కాలంలోనే పరిగి ప్రాంతంలో ఈ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.

ఈ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌లోకి మార్చడం వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని తెలిపారు. గత పాలకులు నీటి బుడగల్లాంటి హామీలు ఇవ్వడం తప్ప పరిగి నియోజకవర్గానికి చేసిందేమి లేదని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలోనే మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌ రోడ్డు సదుపాయం, మన్నెగూడ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు జాతీయ రహదారి నిర్మాణాలు జరిగాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గిరిజన తండాలకు బీటీ రోడ్డు సదుపాయం కలిగిందని, గత పాలకుల హయాంలో రోడ్డుపై పడిన గుంతలు పూడ్చడానికి కనీసం గంప మట్టి కూడా వేయలేదన్నారు. పరిగికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి.హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, రాందాస్‌, ఎంపీపీలు కె.అరవిందరావు, మల్లేశం, సత్యమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, ఆర్‌.ఆంజనేయులు, బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎ.సురేందర్‌కుమార్‌, ఎస్‌.భాస్కర్‌, వైస్‌ ఎంపీపీలు సత్యనారాయణ, మల్లేశం, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మంగు సంతోష్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి సన్మానం
కులకచర్ల, జూలై 31 : పరిగికి డిగ్రీ కళాశాల వచ్చే విధంగా కృషిచేసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని కులకచర్ల, చౌడాపూర్‌ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పరిగిలో ఘనంగా సన్మానించారు. పరిగి నియోజకవర్గం ప్రజల చిరకాల స్వప్నం నిజం చేసిన ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, వైస్‌ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాంలాల్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహులు, మండల కోఆప్షన్‌ సభ్యుడు జుబేర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మొగులయ్య, అశోక్‌, రాజశేఖర్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana