పూడూరు, ఆగస్టు : రైతు బీమా పథకం కోసం రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని మండల వ్యవసాయాధికారి సామ్రాట్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు 2021సంవత్సరం బీమా కోసం 2021 ఆగస్టు 3వ తేదీ వరకు వచ్చిన కొత్త పట్టాదారు పాస్ బుక్‌ల రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకునేందుకు గాను వయో పరిమితి 18ఏండ్ల నుంచి 59ఏండ్ల వయసు ఉన్న రైతులు అర్హులని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు వివరాలతో మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ విస్తరణ అధికారికి నేరుగా అందజేయలని వివరించారు. ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందన్నారు. రైతులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఓ సామ్రాట్‌రెడ్డి కోరారు.