కొడంగల్, ఆగస్టు : ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులు అధికంగా ఉంటారు కాబట్టి వారికి అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమై విద్యను అందించేందుకు అధ్యాపకుల పాటుపడాలని జిల్లా నోడల్ అధికారి శంకర్ తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, సిబ్బందితో సమావేశమాయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయని, విద్యార్థులకు అనుగుణంగా జూమ్క్లాస్, గుగూల్మీట్ ద్వారా కొనసాగే తరగతులను విద్యార్థులు సమయానుకూలంగా వినే సదుపాయం ఉన్నట్లు తెలిపారు.
గత సంవత్సరం 300ల మంది విద్యార్థులు కళాశాలలో చేరగా ఈ సంవత్సరం మొదటి సంవత్సరంలో 300ల మంది విద్యార్థులు చేరినట్లు తెలిపారు. అనంతరం కళాశాలకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.