చుక్క నీటి కోసం దిక్కు దిక్కూ పరుగులు తీసిన రోజులు
ఒక్క చినుకైనా ఇయ్యమ్మా అని తలెత్తి ఆకాశాన్ని అడుక్కున్న దినాలు
కళ్లలోంచి నీరోచ్చి నెర్రెలు విచ్చిన భూమి వెక్కిరించిన క్షణాలు
ఇదంతా 2014కి ముందు… ఆ తర్వాతేంటి?
‘జల’ గణ మన అధినాయక జయహే అంటూ… తెలంగాణ జలకాలాడింది
సమర్ధ నాయకుని పాలనలో పచ్చ’ధనం’ నిజమైన సంపదగా సాగునీటి ప్రాజెక్టుల జలతరంగాలతో రాష్ట్రం కళకళలాడింది
60 ఏళ్లలో సాధ్యం కాని అద్భుతం.. కేవలం ఒక్క దశాబ్దం లోపే ఎలా సాకారమైంది?
పక్క రాష్ట్రంలో వందెకరాలు… తెలంగాణలో ఒక్క ఎకరానికి ఎలా సమానమైంది?
కన్నీటి చుక్కల గతం నుంచి పన్నీటి జల్లుల వర్తమానం వరకూ తెలంగాణ ఎదిగిన తీరేంటి?
సాగునీటి రంగంలో తెలంగాణ పురోగతిని ఆవిష్కరించే ఈ దృశ్యకావ్యం చూడండి… సుపరిపాలనకు నిజమైన అర్థం తెలుసుకోండి