Vasthu Shastra | మాకు ఒక్కతే అమ్మాయి. మగ పిల్లలు లేరు. దీనికి కారణం మా ఇంటికి వాస్తు దోషం ఉండటమేనా?
Vasthu Shastra | పిల్లలు లేకపోవడానికి అనేక కారణాలు. సంతానం ఉన్నా, లేకున్నా.. అది మనిషి తప్పిదం కాదని అర్థం చేసుకోవాలి. కొన్ని జంటల్లో శారీరక లోపాలు కారణం కావచ్చు. కొన్ని జంటలకు గృహాల దిశ - వాస్తు కూడా కారణం కావచ్చు.
Vasthu Shastra | మాకు ఒక్కతే అమ్మాయి. మగ పిల్లలు లేరు. దీనికి కారణం మా ఇంటికి వాస్తు దోషం ఉండటమేనా?
– వి. సుధామాధురి, వరంగల్
పిల్లలు లేకపోవడానికి అనేక కారణాలు. సంతానం ఉన్నా, లేకున్నా.. అది మనిషి తప్పిదం కాదని అర్థం చేసుకోవాలి. కొన్ని జంటల్లో శారీరక లోపాలు కారణం కావచ్చు. కొన్ని జంటలకు గృహాల దిశ – వాస్తు కూడా కారణం కావచ్చు. అయితే, వాస్తు పరంగా గొప్పగా అమరి ఉన్న ఇండ్లలో నివసించేవారికి.. కొన్నాళ్లకు శరీర వ్యవస్థల్లో సానుకూల మార్పులు జరిగి.. సంతాన యోగ్యత కలుగుతున్న ఉదాహరణలు కోకొల్లలు. ఆ సంతానం మగ లేదా ఆడ కావచ్చు. కేవలం ఆడపిల్లలే పుడుతున్నారు అంటే.. ఆ వంశంలో ఎన్నో ఏళ్లుగా ఈశాన్య లోపం, ఆగ్నేయలోపం కొనసాగుతూ ఉండటం వల్ల ఇలా కావచ్చు. అలాంటి దోషాలేమైనా ఉంటే సవరించుకోవడం మంచిది. భవిష్యత్తు తరంలో ఆ ఇబ్బంది ఉండదు.

తూర్పు దిక్కు ఎన్ని ద్వారాలు ఉండాలి. మా ఇంటికి పడమర వైపు రెండు ద్వారాలు ఉన్నాయి. ఏమైనా దోషమా?
– కె. చంద్రశేఖర్, దేవరుప్పుల
ఇంటిని గొప్ప వెంటిలేషన్‌తో నింపితేనే వెలుగు ప్రసరిస్తుంది. అప్పుడే అది శుభగృహం అవుతుంది. తూర్పు-ఉత్తరం ద్వారాలు లేకుండా, దక్షిణం-పడమర ద్వారాలు పెట్టడం సరికాదు. అంటే, ఆ ఇంట్లో వెలుతురు ఉండదని కాదు.ఉదయపు కాంతి అందని ఇల్లు.. అనారోగ్యాలకు చేరువ చేస్తుంది. వేడి వేరు- వెలుగు వేరు. మంట వేరు-కాంతి వేరు! ఈ సూక్ష్మం అర్థమైతే చాలు. కాబట్టి, మీ ఇంటికి తూర్పు ద్వారం పెట్టండి. పడమర రెండు ద్వారాలు పెట్టడం కన్నా.. పశ్చిమ-వాయవ్యంలో ఇప్పటికే ద్వారం ఉంటే కనుక దానికి ఎదురుగా తూర్పు- ఈశాన్యంలో కొత్త ద్వారం ఏర్పాటు చేయండి చాలు. తూర్పు ఉండి, పడమర లేకున్నా సరే.. తూర్పు ద్వారం తప్పనిసరిగా అవసరం.

కొందరు నైరుతిలో లెట్రిన్, సెప్టిక్‌ట్యాంక్ ఉండకూడదని అంటారు. నిజమేనా?
– బి. అంజలి, వికారాబాద్
కొన్ని దిశలు.. కొన్ని పనులకు పనికిరావు. కానీ, ఆ స్థలంలో అవకాశం ఉండటంతో, కొందరు నిర్మాణాలు చేస్తుంటారు. అలా కడుతూ ఉంటే.. ఆ స్థలం వద్దని చెప్పను కానీ, దుష్ఫలితాలు చూపిస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. నైరుతిలో పడక గది, ఆఫీసు గది మంచి ఫలితం ఇస్తుంది. కానీ, లెట్రిన్ పెట్టినా.. అక్కడ సెప్టిక్‌ట్యాంక్ కట్టినా చెడు ప్రభావాలే ఉంటాయి. ఫలితంగా ఇంట్లోని పెద్దలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. నైరుతి ఎంత బలంగా ఉంటుందో.. అంత తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అందుకే, దిశలను మనం జాగ్రత్తగా వాడుకోవాలి. నైరుతిలో సెప్టిక్‌ట్యాంక్ పెట్టినా, లెట్రిన్ గది కట్టినా వెంటనే తొలగించండి.

3. Kitch Toil
నీచ స్థానం-ఉచ్ఛ స్థానం అంటే ఏమిటి? అవి ఇంటికి వర్తిస్తాయా? స్థలానికి మాత్రమే వర్తిస్తాయా?
– కె. మాధవి, బుద్వేల్
ఇంటికి, స్థలానికి, మనిషికి ఉచ్ఛ-నీచ స్థానాలు వర్తిస్తాయి. ఉపయోగించే స్థలంలో ఉచ్ఛ, నీచాలు.. అంటే, ఏ చోట ఏ కార్యాలు చేస్తే ఉత్తమంగా ఉంటాయి? ఏ చోట నీచ కార్యాలు చేసే అవకాశం ఉంటుంది? అంటే.. వంట చేసే స్థలం, మలవిసర్జన స్థలం. ఇవి ఉత్తమ-నీచ స్థలాలు. అయితే.. వీటిని ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో కట్టుకుంటారు. స్థలంలో దక్షిణ భాగం నీచ స్థానం-ఉత్తరం ఉత్తమ స్థానం. తూర్పు ఉచ్ఛస్థానం – పడమర నీచ స్థానం అని విభజిస్తారు. అలాగే మానవ శరీరంలో బొడ్డు కింది భాగం నీచ స్థానం, పైనున్నది ఉచ్ఛ స్థానం. ఇవి చెడ్డవి అనీ అనలేం. వినియోగార్థం ఉపయోగించే స్థానాలు అంతే! మనిషికి రెండూ అవసరమే! ఏదీ తక్కువ కాదు, ఏదీ ఎక్కువ కాదు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read More :
Vasthu Shastra | గుడిలేని ఊరిలో ఇల్లు ఉండకూడదా?
Vasthu Tips | ఇంట్లో సీతారాముల ఫొటోలు పెట్టొద్దు అంటున్నారు. నిజమా?
Vasthu Shastra | టెర్రస్ మీద కిచెన్ కట్టుకోవచ్చా? కడితే.. ఎటువైపు కట్టాలి?
Vasthu Shastra | పెద్ద ద్వారం ఇంటికి మధ్యలో ఉండాలా, చివర్లో ఉండాలా? ఏది మంచిది?
Vasthu Shastra | ఇంట్లో హోమాలు యజమాని చేయాలా? పూజారి చేయాలా?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

