Vaastu Shastra | అన్ని స్థలాలకు సెల్లార్ తీయవచ్చా? అలా తీయకుండా పార్కింగ్ రావడం లేదు. వాస్తుకు ఏది మంచిది?
– కె. దశరథ, నల్లగొండ
శాస్త్రం వేరు. చట్టాలు వేరు. కొన్నికొన్ని నిర్మాణాలకు పార్కింగ్ చాలా అవసరం. కమర్షియల్ బిల్డింగ్‌లకు పార్కింగ్ లేనట్లయితే.. పర్మిషన్ రాదు కూడా! అలాంటి వాటికి తప్పనిసరిగా సెల్లార్ తీయాల్సి వస్తుంది. అయినా ఆ చోటుకు వాస్తుపరంగా సెల్లార్‌ను ఏర్పాటు చేసుకోవాలి. సమస్య ఎక్కడంటే.. ఇంటికి సెల్లార్ అనేది మంచిది కాదు. భూమిపైన – భూమిలోపల చాలా వ్యత్యాసం ఉంటుంది. జీవన శైలి కాబట్టి, ఇండ్లకు సెల్లార్ మంచిదికాదు. స్టిల్ట్‌లో అంటే.. నేలమీద ఖాళీపెట్టి, పైనుంచి నిర్మాణం చేసుకుంటే, మంచి పార్కింగ్ వస్తుంది. కమర్షియల్ నిర్మాణాలకు దక్షిణం రోడ్డు – పడమర రోడ్డు ఉన్నట్లయితే.. సెల్లార్ పెట్టుకోవచ్చు. అప్పుడు దోషం ఉండదు. తూర్పు – ఉత్తరం రోడ్లకు సెల్లార్ పనికిరాదు.
మాకు కో ఆపరేటివ్ బ్యాంకు ఉంది. దానికి ఉత్తరంలో సెల్లార్ ఉంది. నైరుతిలో గేటు ఉంది. ఈశాన్యం పెరిగింది. ఇలా ఉంటే మంచిదేనా? ఫలితాలు బాగుంటాయా? ప్లాన్ పంపాను. చూసి చెప్పండి.
– మానస, సత్తుపల్లి
ముందుగా నైరుతి గేటు మూసేయండి. స్థలానికి తూర్పు- ఈశాన్యం పెరగడం మంచిదే! కానీ, నైరుతి గేటు వల్ల అనేక దోషాలు కలుగుతాయి. బ్యాంకు రుణాలు తీసుకున్నవారు కట్టకపోవచ్చు. బ్యాంక్ విశ్వసనీయత దెబ్బతింటుంది. నైరుతి గేటు.. బ్యాంక్ దివాలా తీయడానికి ఆస్కారం అవుతుంది. మీ బ్యాంక్‌లో సెల్లార్ తీసి, అందులో రికార్డు పెట్టి వాడుతున్నారు. మీది తూర్పు రోడ్డు. పైగా తూర్పులో చాలా పెద్ద స్థలం ఓపెనింగ్ ఉంది. తద్వారా ఆ సెల్లార్ దోషం అవుతుంది. ఫలితాలు గొప్పగా ఉండవు. రానురానూ స్థితిగతులు అడుగంటి పోతాయి. సెల్లార్ మూసేయండి. వాయవ్యం కూడా పెరిగింది. సరిచేయండి. కాస్త సమయం పట్టినా.. ముందుముందు మంచి ఫలితాలు అందుతాయి.
అపార్ట్మెంట్లో ఫ్లాట్ మాది . దానికి ఉత్తరం వైపు మెట్లు, లిఫ్ట్ ఉన్నాయి. మంచిదేనా?
– డి. మూర్తి, జడ్చర్ల
ఇంటి భాగాన్ని కట్ చేయకుండా.. అంటే, మనం నివసించే ఫ్లాట్‌కు ఉత్తరం పారు తెగిపోకుండా, బాల్కనీ భాగంలో ఒకవైపు.. అంటే, ఈశాన్యంలో లిఫ్ట్ – వాయవ్యంలో మెట్లు పెట్టుకొని, ఉత్తరం ముఖంతో ఉన్న ఇండ్లు కట్టుకుంటే దోషం ఉండదు. ఇంటి ముఖంవైపు.. అంటే, ఉత్తరం – తూర్పు భాగంలో మెట్లు – లిఫ్ట్ వేసినట్లయితే ఉత్తరం కప్పు అవుతుంది. పైగా లిఫ్ట్ హెడ్ రూమ్ (మెషీన్ గది) వల్ల పైన ఉత్తరం చాలా ఎత్తు అవుతుంది. అది దోషం. పైగా ఇండ్లకు ఉత్తరం మూతపడి.. సరైన గాలి, వెలుతురు రావు. అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ మార్పులు సాధ్యం కాదు కాబట్టి.. మీరు ఇల్లు మారడం ఉత్తమం.
మా స్థలానికి దక్షిణంలో పెద్ద రోడ్డు ఉంది. తూర్పులో రోడ్డు స్లోపు ఉంది. ‘షాపు – ఇల్లు’ఎలా కట్టాలో చెప్పండి.
– కె. మారుతి, తొర్రూరు
దక్షిణం-తూర్పు రోడ్లు వచ్చాయి అంటే.. అది ఆగ్నేయం బ్లాకు. మీరు దక్షిణం వైపు షాపులకు స్థలం వదలండి. మెయిన్ రోడ్డు దక్షిణంలో ఉంది కాబట్టి, కమర్షియల్ నిర్మాణం దక్షిణం ముఖంగా ఏర్పాటు చేసి కట్టండి. ఈ ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది. ఇంటికి స్థలం వేరు చేసి, తూర్పు ముఖంగా కట్టుకోండి. షాపుల స్థలం కట్‌చేసి, మీ ఇంటికోసం వేరుగా కాంపౌండ్ కట్టి.. పూర్తి తూర్పు ప్లాట్‌గా స్థలాన్ని సరిచేసుకోండి. ఆ తర్వాత ఇంటి నిర్మాణం చేసుకుంటే.. ఆ స్థలానికి చాలా శుభ ఫలితాలు రాబట్టవచ్చు. దక్షిణం షాపులను వేరుచేసి, బయట మీరు కూడా
వాడుకోవచ్చు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vaasthu Shastra | ఒక్క కొడుకు ఉంటే.. అతనికి తూర్పు రోడ్డు ఇల్లు మాత్రమే కట్టి ఇవ్వాలా?
Vasthu Shastra | ఆగ్నేయం ఇంటికి సెల్లార్ ఉండవచ్చా?
Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా?
Vasthu Shastra | మా కాలేజీకి ఈశాన్యంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది.. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?