Vasthu Shastra | మా కాలేజీకి ఈశాన్యంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది.. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?
Vasthu Shastra | కమర్షియల్ ప్రాంగణాల్లో దేవాలయాలను నిర్మిస్తూ ఉంటారు. ఆసుపత్రుల వద్ద, ప్రైవేటు కాలేజీలకు అనుబంధంగా, ఫ్యాక్టరీల ఆవరణలో.. ఇలా కట్టిన ఆలయాలను మానవ ప్రతిష్ఠిత క్షేత్రాలు (ఆలయాలు) అంటారు. మీరు పంపిన ప్లాన్ చూశాను. సరస్వతి ఆలయాన్ని తూర్పు ముఖంగా తిప్పి కట్టారు.
Vasthu Shastra | మా కాలేజీలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది. ఆ నిర్మాణం పెరిగిన ఈశాన్యంలో ఉంది. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?
– కె. విశ్వనాథం, వరంగల్
కమర్షియల్ ప్రాంగణాల్లో దేవాలయాలను నిర్మిస్తూ ఉంటారు. ఆసుపత్రుల వద్ద, ప్రైవేటు కాలేజీలకు అనుబంధంగా, ఫ్యాక్టరీల ఆవరణలో.. ఇలా కట్టిన ఆలయాలను మానవ ప్రతిష్ఠిత క్షేత్రాలు (ఆలయాలు) అంటారు. మీరు పంపిన ప్లాన్ చూశాను. సరస్వతి ఆలయాన్ని తూర్పు ముఖంగా తిప్పి కట్టారు. దానికి ఈశాన్యంలో ఎత్తయిన భవనం ఉంది. పైగా వాగ్దేవి ఆలయ ఈశాన్యభాగం.. ఆ భవంతిని తాకుతూ ఉంది. తద్వారా ఆలయానికి ఈశాన్య దోషం వచ్చింది. అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణ స్థలం ఇరుకుగా ఉంది. చుట్టూ ప్రహరీ కూడా లేదు. పడమర ఓపెన్ చేసి, అంటే కాంపౌండు వేయకుండా ఆగమ విరుద్ధంగా కట్టారు. ముందు ఈశాన్య భవనం తొలగించి, అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ స్థలం ఏర్పరచి ప్రహరీ కట్టండి. అలాగే మానవ నిర్మిత ఆలయాలకు తప్పనిసరిగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభాభిషేకం జరిపించాలి. ఆలయం కట్టడం కాదు.. దాన్ని శాస్త్రహితంగా నిర్మిస్తేనే అమ్మవారు నివాసం ఉంటారు.

3. Sump Water
గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీ వదిలి, పైన ఇల్లు నిర్మించి.. కింద నీళ్ల సంపు కట్టొచ్చా?
– రాధాకృష్ణ, దిల్సుఖ్నగర్
కింది భాగం (స్టిల్ట్) ఖాళీగా వదిలి, దానిని స్టాఫ్ కోసం, పార్కింగ్ కోసం, చిన్నచిన్న ఫంక్షన్ల కోసం వాడుకోవడం దోషం కాదు. కింది ఫ్లోర్లో నీళ్ల సంపు కట్టాలని అనుకుంటే, వసతిపరమైన ఇబ్బంది వస్తుంది. ఇంటి చుట్టూ ఖాళీ ఉండి, ఉత్తరం-తూర్పు వైపు ఉన్న స్థలంలో నీళ్ల సంపు నిర్మాణం బాగుంటుంది. అయితే చుట్టూ అనుకూలమైన జాగా లేనప్పుడు కింది భాగంలో, ఈశాన్యంలో.. గేట్లకు, కింది గదుల ముఖద్వారాలకు అడ్డుగా లేకుండా నీటి సంపు నిర్మాణం చేసుకోండి. రేపు కింద ఇల్లు కడితే.. ఇబ్బందులు రాకుండా, జాగ్రత్త వహించాలి. వాస్తు విరుద్ధంగా ఏ ప్రణాళికా వద్దు.

2. Canal
మాది పెద్ద లేఅవుట్. విల్లాలు కడు తున్నాం. మధ్యలో నీటి కాలువ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– కె. ధనలక్ష్మి, శంషాబాద్
వందల ఎకరాల్లో పెద్దపెద్ద వెంచర్లు చేస్తున్నప్పుడు కాలువలు, చెరువులు, గుట్టలు, వాగులు కూడా వస్తుంటాయి. ప్రకృతి సిద్ధమైన వాటిని తొలగించలేక పోయినా.. ఇండ్ల నిర్మాణ స్థలాన్ని వాటికి దూరంగా, దోషరహితంగా ప్లాన్ చేసుకోవాలి. మీ స్థలం మధ్యలో కాలువ ఉంది. కాబట్టి దానికి చక్కని వంతెనను నిర్మించి, కాలువకు అటూ-ఇటూ రోడ్డు వేసి.. రెండు వైపులా విల్లాలు కట్టుకోవచ్చు. అయితే, దక్షిణం వైపు కాలువ వచ్చే నివాసాలకు దక్షిణం రోడ్డు తప్పనిసరిగా కాంపౌండు నిర్మించాలి. మీరు ముందుగా ఫస్ట్ఫేజ్గా కాలువకు దక్షిణం వైపు నిర్మాణాలు చేపట్టండి. కాలువ చిన్నది అయితే, దానిమీద కప్పు వేయండి. లేదా పైప్‌లైన్‌తో పునరుద్ధరించండి.

4. Pent House
మొత్తం స్లాబ్ మీద నాలుగు మూలలకూ నాలుగు గదులు వేసుకోవచ్చా?
– ఎం. శివ, కీసర
మీరు టెర్రస్ మీద నిర్మాణం చేయాలి అనుకుంటే.. నాలుగు మూలల్లో నాలుగు గదులు వేయడం మంచిదికాదు. అది సవ్యంగానూ ఉండదు. ముఖ్యంగా విదిశలు మూసుకుపోతాయి. కావాలంటే ఒక గదిని నైరుతి భాగంలో వేసుకోవచ్చు. అది శుభకర నిర్మాణం. పడమర భాగం అంతా ఒక హాలుగా వేసుకొని లేదా రెండు గదులు వేసుకొని వాడుకోవచ్చు. అప్పుడు తూర్పు భాగం అంతా ఖాళీగా ఉంటుంది. గృహస్థు ఆనందకరమైన జీవనం గడుపుతారు. అలాగే దక్షిణం వైపు ఒక భాగమంతా కప్పు వేసుకొని, ఉత్తర భాగం వదిలేయాలి. అప్పుడు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నాలుగు మూలల్లో వేయడం.. అది కూడా వేరువేరుగా గదులు వేయడం మంచిది కాదు. కావాలి అంటే.. దక్షిణ – నైరుతిలో, ఉత్తర-వాయవ్యంలో వేరువేరుగా గదులు వేసుకోవచ్చు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read More :
Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

