Vaasthu Shastra | ఊళ్లో ఉన్న మా పాత ఇంట్లో పుట్ట పెరిగింది. దానిని తొలగించి, ఇంటిని వాడుకోవచ్చా?
Vaasthu Shastra | వాడకంలేని, నిర్వహణ కరువైన నివాసాల్లో ప్రకృతి జీవులు చేరిపోతాయి. పాత ఇండ్లలో పగుళ్లు రావడం, చెదలు పట్టడం, పుట్టలు పెరగడం సాధారణం. అలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. పాత ఇంటిని తొలగించి కొత్త ఇల్లు కట్టాలని అనుకున్నప్పుడు.. ఇంట్లో పెరిగిన పుట్టకు శాంతిపూజ జరిపించాలి.
Vaasthu Shastra | ఊళ్లో ఉన్న మా పాత ఇంట్లో పుట్ట పెరిగింది. దానిని తొలగించి, ఇంటిని వాడుకోవచ్చా?
– బి. ఆనంద సాయి, మంతెన
వాడకంలేని, నిర్వహణ కరువైన నివాసాల్లో ప్రకృతి జీవులు చేరిపోతాయి. పాత ఇండ్లలో పగుళ్లు రావడం, చెదలు పట్టడం, పుట్టలు పెరగడం సాధారణం. అలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. పాత ఇంటిని తొలగించి కొత్త ఇల్లు కట్టాలని అనుకున్నప్పుడు.. ఇంట్లో పెరిగిన పుట్టకు శాంతిపూజ జరిపించాలి. ఇతర జీవులు అందులో నివాసం ఉంటున్నాయి కాబట్టి.. వాటిని గౌరవంగా, ప్రేమపూర్వకంగా సాగనంపడానికి చేసే కార్యమే.. శాంతిపూజ. ఇంటితోపాటు పుట్టను తొలగించి, పుట్ట ఉన్నచోట మట్టితో నింపడం లేదా పూర్తిగా మట్టిని తొలగించడం ఉత్తమం. శాస్త్రపద్ధతిలో ఇంటి ప్లాను తయారు చేసుకొని, కొత్త ఇంటిని కట్టుకోవచ్చు. తప్పులేదు. చాలామంది అయిన వాటికీ, కాని వాటికీ సెంటిమెంట్లు కలిపి ఏదో ఏదో చెప్పి భయపెడతారు. నిజానికి, ఎలాంటి ఇబ్బందీ ఉండదు.మన జీవితం కోసం, మన వెసులుబాటు కోసం మనం పద్ధతిగా నడుచుకుంటున్నప్పుడు ప్రకృతి ద్రోహం చేయదు.

మేము ఎక్కువగా పసుపు పండిస్తాం. పంట నిలువ కోసం గచ్చునేల, దుంపలను ఉడకబెట్టేందుకు పొయ్యిలు ఎక్కడ వేసుకోవాలి?
– బి. శంకర్, మేడిపల్లి, నిజామాబాద్ జిల్లా
తెలంగాణలో ఉత్తర ప్రాంత రైతులు అధికంగా పసుపు పంట సాగు చేస్తారు. పంట పండే నేలను వదిలివేస్తే.. మొత్తం క్షేత్రంలో దక్షిణ లేదా పడమర భాగం పసుపు పంటను కోసిన తర్వాత చేపట్టే కార్యకలాపాలకు కేటాయించాలి. పసుపు పంటలో పిల్ల కొమ్ములు – తల్లి దుంపలను వేరు చేసి నిల్వ చేయడానికి అవసరమైన గచ్చు నేలను.. దక్షిణం – పడమరలో ఏర్పాటు చేసి, ఆ నేలమీద పడమరలో – నైరుతిలో మనం ఉండే గదులు వేసుకోవాలి. ఇదంతా ప్రత్యేక ధాన్య విభాగం. దుంపలను ఉడకబెట్టడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పసుపు ఎగుమతి పంట కదా! శుభ్రపరిచిన తల్లి దుంపలు – పిల్ల దుంపలను వేరువేరుగా ఉడకబెడుతారు. కాబట్టి వేరువేరు పొయ్యిలను ఆగ్నేయ లేదా వాయవ్య భాగంలో వేసుకోవాలి. పసుపు ఉడకబెట్టడానికి నీటి నిలువ కూడా అవసరం. కాబట్టి దక్షిణ – పడమర నైరుతిలో గద్దెలు వేసి, నీటి ట్యాంకులు పెట్టాలి. నైరుతిలో మనం ఉండటానికి వేసుకునే గది స్లాబు నిర్మాణం అయితే.. దానిపైన కూడా పెట్టొచ్చు. ఉడకబెట్టిన పసుపు దుంపలను దక్షిణ – పడమరలో అంటే గదుల ముందు ఉన్న గచ్చునేల మీద ఆరబెట్టుకోవాలి. గచ్చు చుట్టూ అడ్డు కట్టకూడదు. పసుపు దుంపలను మూడు ఇంచుల మందంతో గచ్చునేల మీద ఆరబెడుతారు. కాబట్టి అడ్డుగా గోడలు, గదులు రాకుండా చూడాలి. దినమంతా ఆరిన దుంపలను రాత్రిపూట దక్షిణం – పడమరలో గదుల ముందు భాగంలో రాశిగా పోసుకోవాలి. అలాగే మొత్తం వ్యవసాయ భూమిలో ఎత్తు భాగాన్ని నైరుతిలో చేసుకొని ఆ గడ్డమీద 12X9X6 అడుగుల గోతులు తీసి, శుభ్ర పరచిన కొమ్ములను నిలువ చేసుకోవాలి. అలాగే నేలమీద, చెట్ల కింద విత్తనాలకు ఉపయోగపడే దుంపలను రాశులుగా నిలువ చేయవచ్చు.

కొత్త ఇల్లు కొనేటప్పుడు భూమి వాస్తు చూడాలా? ఇంటి వాస్తు చూడాలా?
– వి. ధరణి, వరంగల్
అన్నీ చూడాలి. స్థలం ఎప్పుడైనా ప్రధానమైందే! మంచి స్థలం – మంచి లే అవుట్ – మంచి నిర్మాణం.. అన్ని ఇండ్లకూ తప్పక అవసరం. గొప్ప ఎలివేషన్, ఖరీదైన ఇంటీరియర్, గాజు గోడలు, ఆకర్షణీయమైన వస్తువులు.. మనల్ని కాపాడవు. శాస్త్ర సమ్మతమైన సాధారణమైన ఇల్లు ఉంటే చాలు. చాలామంది ఇండ్లు బాగా కట్టి అమ్ముతారు. కానీ, స్థలానికే వాస్తు ఉండదు. అంటే ఆ
లే అవుట్ దిశలకు విరుద్ధంగా, వీధిపోట్లు చూడకుండా, స్థలాన్ని సరిచేయకుండా ఇండ్లు (విల్లాలు) కడతారు. మంచి వంటకాలు సరే.. ముందు మంచి కాయగూరలు ఎంచుకోవాలి! ఇండ్లు కూడా నైరుతి గదికి బాల్కనీలు పెట్టి, చుట్టూ అద్దాలు బిగించి, ఈశాన్యం-ఉత్తరం కట్ చేసి కడతారు. ఇల్లు బాగుండి.. స్థలం అసలు బాగా లేకపోయినా.. స్థలం చక్కగా ఉండి, ఇల్లు బాగా లేకపోయినా.. మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే, అక్కడ ఉండేది మనమే కదా!

కిచెన్‌కు పడమరలోని హాలుకు, త్తరం – ఈశాన్యంలోని హాలుకు వెళ్లేలా ద్వారం లేదా పెద్ద ఆర్చి పెట్టొచ్చా?
– బి. విజయలక్ష్మి, మోత్కూర్
ఆగ్నేయం ఓపెన్ కిచెన్ పెట్టుకున్నట్లయితే పడమరకు, ఉత్తర – ఈశాన్యం (డ్రాయింగ్ రూము)లోకి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా డైనింగ్ ఏరియా ఎక్కడ అనేది ముందు నిర్ణయించుకోవాలి. ఇంటికి ఆగ్నేయంలో కిచెన్ వచ్చి, మీ ఇల్లు పడమర వీధి అయితేనే ఈ వీలు ఉంటుంది. అప్పుడు కేవలం కిచెన్‌లో తూర్పు గోడకు ప్ల్లాట్‌ఫామ్ కట్టుకొని, పడమర – ఉత్తరం గోడలు
కట్టకుండా, కిచెన్‌కు ఆగ్నేయంలో యుటిలిటీ (గిన్నెలు కడిగే స్థలం) ఏర్పాటు చేసుకోండి. ప్రత్యేకంగా ఆర్చిలు అవసరం లేదు. అక్కడి స్థలాన్ని బట్టి రెండు వైపులా ఓపెన్
పెట్టుకోవచ్చు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read More :
Vasthu Shastra | ఇల్లు కూలిపోతే, కాలిపోతే వాస్తు లేదనే అనుకోవాలా? కారణాలు ఏమిటి?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

