Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vasthu Shastra | స్థలం పెద్దగా ఉంటే.. నాలా తూర్పు దిశలో వచ్చేలా విభాగం చేయండి. అంటే, తూర్పు - పడమర భాగాలుగా స్థలాన్ని విడగొట్టి, పడమర భాగంలో ఇల్లు కట్టాలి. అప్పుడు ఆ నాలా మీ ఇంటికి తూర్పు అవ్వాలి. ఆ నాలా తూర్పు అంచున ఇంటి తూర్పు కాంపౌండు కట్టాలి.
Vasthu Shastra | గృహం మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
– బి. స్వాతి, వారాసిగూడ
గృహం గర్భస్థానంలో ఖాళీ స్థలం ఉండాలి. బుద్ధ విగ్రహాలు – చెట్లు – ఫౌంటెయిన్ శిఖరాలు కట్టడం, పెట్టడం మంచిదికాదు. హాలు అనేది ఇంటికి నాభి స్థానంలో వస్తుంది. అది విగ్రహాల స్థాపనకు కాదు. అలాంటివి మీరు పెట్టాలనుకుంటే.. అవి దేవుళ్లవి కావచ్చు, ఇతరత్రావిగ్రహాలు కావచ్చు. ఇంటి నాభిని తప్పించి, అటు పడమర భాగానికి కానీ, ఇటు దక్షిణం భాగానికి కానీ జరిపి నిలబెట్టుకోవాలి. చెవికి రింగు వేసినట్టు నాలుకకు రంధ్రం చేసి.. లోలాకులు వేస్తామంటే ఎంత బీభత్సమో.. గృహం నాభిలో అందాల కోసం కట్టడాలు చేస్తే కూడా అంతే చెడు ఫలితం. గృహం జీవహితంగా కనిపించేలా ఉండాలి. కాబట్టి, ఆ విషయాన్ని వివేకంతో అర్థం చేసుకొని, తగిన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే, మీ అర్థంలేని ఆలోచనలు కుటుంబ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి.
మా స్థలం మధ్యలోంచి కాలనీ ‘నాలా’ (కాలువ) వెళ్తున్నది. ఆ స్థలంలో ఇల్లు ఎలా కట్టాలి? అసలు కట్టాలా, వద్దా?
– ఎం. పుష్ప, జూబ్లీహిల్స్
స్థలం పెద్దగా ఉంటే.. నాలా తూర్పు దిశలో వచ్చేలా విభాగం చేయండి. అంటే, తూర్పు – పడమర భాగాలుగా స్థలాన్ని విడగొట్టి, పడమర భాగంలో ఇల్లు కట్టాలి. అప్పుడు ఆ నాలా మీ ఇంటికి తూర్పు అవ్వాలి. ఆ నాలా తూర్పు అంచున ఇంటి తూర్పు కాంపౌండు కట్టాలి. మీ ప్లాను చూశాను. మీది దక్షిణం రోడ్డు కాబట్టి దక్షిణం ముఖంగా గృహం కట్టుకోవచ్చు. తూర్పు భాగాన్ని ఆఫీసుగా వాడుకోవచ్చు. దానిలోకి మీ ఇంట్లోంచి గేటు పెట్టకుండా, బయటి నుంచే వాడుకోవాలి. తూర్పు భాగం అవసరం లేదు అనుకుంటే, ఇతరులకు ఇచ్చేయవచ్చు. అయితే రెండు భాగాలు చేసినప్పుడు పడమర భాగంలో ఇల్లు ఎంత వైశాల్యంలో వస్తుందో చూసుకొని దానికి అనుకూలంగా శాస్త్రపరంగా ఇల్లు కట్టుకోండి.
ఇల్లు ‘యూ’ ఆకారంలో కట్టుకోవచ్చా?
– ఎం. శకుంతల, చింతల్
మనం నివసించే భవనాలు కట్టేటప్పుడు సంప్రదాయబద్ధంగా, శాస్త్రబద్ధంగా ఆలోచించాలి. ప్రయోగాలు చేయొద్దు. బిడ్డ ఏ రంగులో పుట్టినా మనం ఎలా అంగీకరిస్తామో.. ఇంటి నిర్మాణంవిషయంలో శాస్త్రం ఏది చెబితే అదే అంతిమమని గ్రహించాలి. ప్రకృతికి వ్యతిరేకంగా ఎలాగైతే ప్రవర్తించలేమో.. శాస్త్రానికి వ్యతిరేకంగా కూడా అలానే వ్యవహరించలేం. ఇల్లు నాలుగు మూలలతోనే కట్టాలి. గృహం తూర్పును కట్ చేస్తూ.. ‘యూ’ ఆకారంగా కడితే, తూర్పు భాగం లోపిస్తుంది. ఇది గృహ యజమానికి ఇబ్బంది కలిగిస్తుంది. విశాలమైన పాఠశాలలు, కళాశాలలు వందల అడుగుల కొలతలతో ద్విశాలగా (ఎల్ ఆకారంగా), త్రిశాలగా (యూ ఆకారంగా) కట్టుకునే అవకాశం ఉంటుంది. పరిమితమైన కొలతలు కలిగిన గృహాన్ని ముక్కలు చేసి కట్టవద్దు. ఫలితాలు తీవ్రంగా ఉంటాయి.
ఫాంహౌస్‌లో దక్షిణం – పడమర కాంపౌండ్లకు ఆనుకొని.. జాలి గోడలతో షటిల్ కోర్టు కట్టొచ్చా?
– ఎం. సీతారామరాజు, తెల్లాపూర్
దక్షిణం – నైరుతిలో ఏ నిర్మాణం చేసినా అది ప్రధాన కాంపౌండ్లకు తాకకుండా ఉండాలి. అంటే, షటిల్ కోర్టు కట్టిన తరువాత దాని దక్షిణం – పడమరల వైపు నుంచి ప్రదక్షిణం చేసేంత ఖాళీ ఉండాలి. దానికి ప్రత్యామ్నాయం లేదు. నైరుతి బరువు పెట్టొచ్చు కదా! అన్న కొద్దిపాటి పరి జ్ఞానంతో నిర్ణయాలు చేయవద్దు. దేనికోసం దేని ప్రాధాన్యతనూ దెబ్బతీయవద్దు. ప్రధానమైన కాంపౌండ్లు అవి. వ్యవసాయ గృహంలో కానివ్వండి.. సాధారణ గృహంలో కానివ్వండి.. వాటిని స్వతంత్రంగా ఉండనివ్వాలి. ఆ గోడలు కలిసి వస్తాయనే అంచనాతో, వాటిని ఆనుకొని నిర్మాణం వేయడం మంచిది కాదు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read More :
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

