మియాపూర్: సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో భరోసాగా నిలుస్తున్నదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ సాయినగర్‌కు చెందిన శరీన బేగంకు సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 2 లక్షల ఆర్థిక సహాయ పత్రాన్ని ఆదివారం తన నివాసంలో విప్ ఆరెకపూడి గాంధీ అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో భరోసాగా నిలుస్తున్నదన్నారు. సీఎం నిధి సేవల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందిస్తూ ఆరోగ్యాలకు అండగా నిలుస్తున్నదని విప్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జిల్లా గణేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.