Viral Video | ఛత్తీస్‌గఢ్‌లో నిర్ఘాంతపోయే ఘటన ఒకటి చోటు చేసుకుంది. కూలర్ ఎందుకు ఆఫ్ చేశావని అడిగినందుకు ఓ వ్యక్తిని మహిళ చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ మెడికల్ కళాశాలలో చోటు చేసుకుంది.
అంబికాపూర్ మెడికల్ కళాశాలకు చెందిన ఆసుపత్రి వెయిటింగ్ హాల్లోని కూలర్ కింద రాత్రి ఓ వ్యక్తి నిద్రిస్తుంటాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళ కూలర్‌ను ఆఫ్ చేస్తుంది. దీంతో మెలుకువలోకి వచ్చిన సదరు వ్యక్తి.. కూలర్‌ను ఎందుకు ఆఫ్ చేశావంటూ మహిళను ప్రశ్నిస్తాడు. అందుకు ఆమె స్పందిస్తూ చాలా చల్లగా ఉండటం వల్ల ఆఫ్ చేశానని సమాధానమిస్తుంది. దీంతో మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మహిళ సదరు వ్యక్తిని చెప్పుతో కొడుతూ.. కాలితో తంతుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిర్ఘాంత పోతారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తారు. అయితే, తనకు కావల్సిన వారు ఎవరూ ఆసుపత్రిలో లేరని.. బయట వేడిగా ఉండటంతో ఇక్కడకి వచ్చి పడుకున్నట్లు చెబుతాడు. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అక్కడి నుంచి పంపించేస్తారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మహిళపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
छतीसगढ़ के अंबिकापुर मेडिकल कॉलेज के OPD में एक महिला ने युवक की पिटाई कर दी. बताया जा रहा है कि महिला ने ये सिर्फ़ इसलिए किया क्योंकि हॉल में चल रहे कुलर को महिला ने बंद कर दिया था. इस व्यक्ति ने महिला से कूलर बंद करने का कारण पूछा लिया. pic.twitter.com/BrZ2xvL4Sa
— Priya singh (@priyarajputlive) October 19, 2022