జూకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రూర జంతువుల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లే ప్రయత్నం అస్సలు చేయొద్దు. అందుకే.. సింహాలు, పులుల ఎన్‌క్లోజర్‌కు దూరం నుంచే టూరిస్టులను పంపిస్తుంటారు. ఇదివరకు ప్రమాదవశాత్తు ఎన్‌క్లోజర్‌లో పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్లను చాలామందిని చూశాం. అయితే.. ఈ యువతి మాత్రం ఏమాత్రం భయపడకుండా.. అందరూ చూస్తుండగానే సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకేసింది. దీంతో జూకు వచ్చిన ఇతర టూరిస్టులు షాక్ అయ్యారు.
ఎన్‌క్లోజర్‌లోకి దూకగానే రోజా పూలను చేతుల్లో పట్టుకొని డ్యాన్స్ చేసింది ఆ యువతి. సింహం వైపు చూస్తూ.. కింగ్ ఐలవ్యూ అంటూ.. తన దగ్గర ఉన్న కరెన్సీ నోట్లను సింహం మీదికి విసిరేసింది. ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ఈ ఘటన న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూలో చోటు చేసుకుంది. అయితే.. 2019లో కూడా ఇదే జూలో ఆ యువతే సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి ఇలాగే డ్యాన్స్ చేసినట్లు దానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఆ యువతి చేసిన పనికి వెంటనే అలర్ట్ అయిన జూ సిబ్బంది.. తనను సింహం ఎన్‌క్లోజర్ నుంచి బయటికి తీసుకొచ్చి అదుపులోకి తీసుకున్నారు. తనపై ఎటువంటి చర్యలు తీసుకున్నది మాత్రం తెలియలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హనుమంతుడి కాళ్లకు మొక్కి మరీ గుడిలోని హుండీని ఎత్తుకెళ్లాడు
how to fail UPSC exam : సివిల్స్‌లో ఎలా ఫెయిల్ అవ్వాలి? ఈ వీడియో చూసి తెలుసుకోండి
చెప్పుతో మొసలిని బెదిరించిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. వైరల్ వీడియో
నా ఫోటోనే తీస్తావా.. టూరిస్ట్‌పై ఎద్దు దాడి.. వైరల్ వీడియో
ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చెంపదెబ్బ కొట్టాలంటూ యువతికి ఉద్యోగం ఇచ్చాడు.. వీడియో