eBaby : ఆన్లైన్లో వీర్యాన్ని ఆర్డర్ చేసి ఇన్సెమినేషన్ ద్వారా ఈబేబీకి జన్మనిచ్చిన మహిళ
ఆన్లైన్లో వీర్యాన్ని ఆర్డర్ చేసి ఇన్సెమినేషన్ | ఈ జనరేషన్ మొత్తం వర్చువల్ ప్రపంచంలో బతుకుతోంది. టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు
ఈ జనరేషన్ మొత్తం వర్చువల్ ప్రపంచంలో బతుకుతోంది. టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుండటంతో.. జనరేషన్ కూడా ఆ టెక్నాలజీకి అనుగుణంగా లైఫ్‌స్టైల్‌ను చేంజ్ చేసుకుంటోంది. ఇదివరకు ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే.. ఖచ్చితంగా ఆడా, మగా కలవాల్సిందే. కానీ.. నేడు మగాడి అవసరం లేకుండానే.. ఏకంగా బిడ్డలను కనేస్తున్నారు మహిళలు.

అది ఎలా సాధ్యం అంటే.. టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా.. అది సాధ్యమే. దాన్నే కృత్రిమ గర్భదారణ అంటారు. మగాళ్ల వీర్యాన్ని ఆన్లైన్లో అమ్మే రోజుల్లో ఉన్నాం మనం ఇప్పుడు.
తాజాగా ఓ మహిళ.. తన రెండో బిడ్డను కృత్రిమ గర్భదారణ ద్వారా కనాలని అనుకుంది. అందుకే.. ఆన్లైన్లో వీర్యాన్ని ఆర్డర్ చేసింది. ఇన్సెమినేషన్ ప్రక్రియ ద్వారా ఏకంగా ఈబేబీకి జన్మనిచ్చింది.
ఇంగ్లండ్‌లోని నార్త్ యోర్క్‌షైర్‌కు చెందిన స్టెఫెనీ టేలర్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. తన వయసు 33 ఏళ్లు. తను ఇప్పటికే ఫ్రాంకీ అనే కొడుకు ఉన్నాడు. అ పిల్లాడికి 5 ఏళ్లు. అయితే.. తనకు కొడుకు పుట్టగానే.. భర్తతో విడిపోయింది టేలర్. అందుకే.. రెండో బిడ్డను ఈ విధంగా కనాలని అనుకొని.. వీర్యాన్ని ఆర్డర్ చేసి.. రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చింది.
వీర్యంతో పాటు.. ఇన్సెమినేషన్ కిట్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి.. యూట్యూబ్‌లో ఎలా గర్భదారణ పొందాలో తెలుసుకొని.. ఆ వీర్యాన్ని తన అండంలో ప్రవేశపెట్టింది టేలర్. ఇన్సెమినేషన్ చేసుకున్న రెండు వారాల తర్వాత తను గర్భం దాల్చింది. 9 నెలల తర్వాత అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమెకు ఈడెన్ అనే పేరు పెట్టింది. తనకు వీర్యం ఇచ్చిన దాతను.. ఈడెన్ భవిష్యత్తులో కలవాలనుకున్నా తనకు ఎటువంటి సమస్య లేదని.. టేలర్ చెప్పింది. అయితే.. తనకు వీర్యం దానం చేసిన వ్యక్తి వివరాలను మాత్రం టేలర్ వెల్లడించలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Taxi Top Garden : కరోనా ఎఫెక్ట్.. క్యాబ్‌లను ఖాళీగా ఉంచలేక.. టాప్ మీద గార్డెన్ ఏర్పాటు
అబ్రహం లింకన్ గడ్డం పెంచడం వెనుక ఉన్న కథేంటో తెలుసా !
1971 ఎంత స్పెషలో ! ఒక్క ఏడాదిలోనే ఎన్నెన్ని అద్భుతాలో !!
ఆ 2 ద్వీపాల మధ్య దూరం 4 కిలోమీటర్లే.. కానీ ఎలా వెళ్లినా ఒకరోజు పడుతుంది.. ఎందుకలా
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

