Viral Video | భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. ప్రస్తుతం ఈ పండగకి మూడు రోజులే సమయం ఉంది. దీంతో ప్రజలు తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడం ప్రారంభించేశారు. ఇందులో భాగంగా ఇంటిని శుభ్రం చేసుకునే పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలను గాలికొదిలేస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన ఇంటి కిటికీని ప్రమాదకరస్థాయిలో నిలబడి తుడుస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియోలో.. ఓ మహిళ నాలుగో అంతస్తులోని ఇంటి కిటికీని శుభ్రం చేస్తూ కనిపించింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా..? అక్కడే పొరపాటు. ఆమె శుభ్రం చేస్తున్నది ఇంటి బయటవైపు ఉన్న కిటికీ. ఎలాంటి ఆసరా లేకుండా ప్రమాదకరంగా నిలబడి కిటికీ అద్దాలు తుడుస్తూ కనిపించింది. ఏమాత్రం పట్టుతప్పినా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. పండగపూట ఇలాంటి అజాగ్రత్త పనులు చేయకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Agar inke ghar Laxmi ji nahi aayi toh kisi ke ghar nahi aayegi Diwali pe pic.twitter.com/SPTtJhAEMO
— Sagar (@sagarcasm) October 20, 2022