Viral Video: ఓ ప్రధాన రహదారిపై కారు దూసుకెళ్తున్నది. రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలు ఉన్నాయి. అయితే వాటిలో ఏ చెట్టుపై నుంచి జారిపడిందో గానీ ఓ పాము కారు బానెట్‌పై ప్రత్యక్షమైంది. బానెట్‌పై పడగానే స్పీడ్‌గా అటూఇటూ పాకుతున్న పామును చూసి ఆ కారులో ఉన్న యువతి, యువకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాసేపటికి షాక్ నుంచి తేరుకుని కారులోపలి నుంచే దాన్ని వీడియో తీయడం మొదలుపెట్టారు.
ఇంతలో పాము కారు బానెట్‌పై నుంచి ముందు అద్దంవైపు (విండ్ స్క్రీన్ వైపు) దూసుకొచ్చింది. దాంతో భయపడిపోయిన కారులోని యువజంట సైడ్ అద్దాలను పూర్తిగా ఎక్కించి మూసేశారు. అనంతరం ఆ పాము కారు ముందు అద్దం నుంచి డ్రైవర్ పక్కన అద్దం వైపు వచ్చింది. ఆ తర్వాత పాము ఎటు పోయిందో తెలియదుగానీ 22 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తున్నది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను ఒకసారి వీక్షించండి.