Viral Video: ‘ఇంట్లో పంచభక్షపరమాన్నాలు వండిపెట్టినా పొరుగింటి పుల్లకూరే రచిగా ఉందంటారు మీ మగాళ్లు’ అని భార్యలు తరచూ భర్తలను వెక్కిరిస్తుంటారు. ఎందుకంటే భార్య వంట ఎంత బాగున్నా భర్తలు వంకలు పెట్టకుండా ఉండరు. చాలా కొద్దిమంది భర్తలు మాత్రం భార్య చేతి వంటనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి ఓ భర్త మీద అతని భార్య ప్రాంక్ చేసి ఆటాడుకున్నది. భార్య రహస్యంగా పెట్టిన ఉప్పు తిన్న భర్త తన ముఖ కవళికలు మారుతున్నా బయటపడకుండా అణుచుకున్న తీరు నవ్వు తెప్పిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భర్తకు ఇష్టమైన మాంసం, రెడ్ కిడ్నీ బీన్స్‌తో సూప్ చేసిన ఓ మహిళ.. ఆ సూప్‌ను తినిపిస్తూనే భర్తపైన, కొడుకుపైన ప్రాంక్ చేసిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆమె స్పూన్‌తో సూప్ తినిపిస్తూ మధ్యలో ఒక స్పూన్ నిండా ఉప్పు తీసుకుంది. ఆ ఉప్పు స్పూన్‌ను సూప్‌లో ముంచి ఎప్పటిలాగే భర్త నోట్లో పెట్టింది. వెంటనే భర్త ముఖంలో కవళికలు మారిపోయాయి. కానీ అతను వాటిని బయటపడనీయలేదు. ‘టేస్టు మారిందా’ అని భార్య అడిగినా బాగానే ఉందన్నట్టు సంజ్ఞ చేశాడు.
మరో స్పూన్ నిండా ఉప్పు తీసుకుని భర్త పక్కన కూర్చుని ఉన్న కొడుకుపైనా అదే ప్రయోగం చేసింది. అతడు వెంటనే దాన్ని ఉమ్మబోయి తండ్రి సంజ్ఞతో ఆగిపోయాడు. అతను కూడా టేస్టు బాగానే ఉందని తన తల్లికి అబద్ధం చెప్పాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన మహిళ.. ‘వాళ్లు ఎందుకు అబద్ధం చెప్పారు’ అనే క్యాప్షన్ ఇచ్చి లాఫింగ్ ఎమోజీని యాడ్ చేసింది.
ఈ వీడియోను ఫ్యామిలీ ఫన్ వీడియోలను క్యాప్చర్ చేసే పాపులర్ ఛానెల్ ‘ఓన్లీ ద క్రౌడర్స్’ తన ఇన్‌స్టా హ్యాండిల్లో పెట్టడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 3.63 లక్షల మంది వీక్షించారు. 12,300 మంది లైక్ చేశారు. భారీగా కామెంట్ల వర్షం కురుస్తున్నది. ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.