Money from Drain Pipe | ఇంటి బయట ఉన్న డ్రైనేజీ పైపులో నుంచి కట్టలు కట్టలుగా డబ్బులు పడటం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ. అయితే మీకోసమే ఈ వీడియో. ఒకసారి చూసేయండి. ఇలా డ్రైనేజీ పైపు నుంచి డబ్బుల కట్టలు, నగలు పడిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. కలబుర్గి ప్రాంతానికి చెందిన శాంత గౌడ బిరాదర్ అనే వ్యక్తి.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటులో జాయింట్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు.
అతని ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలోనే డ్రైనేజీ పైపులో కట్టలు కట్టల డబ్బులు బయటపడ్డాయి. ఆ పైపులో డబ్బు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఒక ప్లంబర్‌ను పిలిపించి పైపులోని డబ్బును బయటకు తీశారు. ఈ పైపులో రూ.25 లక్షల నగదు, బంగారం దొరికినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
#Unbelievable #DrainMoney A drain pipe out of which come tumbling out wads of currency: this happened in #Kalburgi when #ACB raided house of PWD joint engineer ShanthaGowdaBiradar & plumber was called in to retrieve hidden cash; Rs 25lakh & gold recovered @ndtv @ndtvindia pic.twitter.com/XBFrCVI37n
— Uma Sudhir (@umasudhir) November 24, 2021