శాకాహారమా? లేక మాంసాహారమా? ఏది ఆరోగ్యానికి మంచిది.. ఆధారాలతో సహా నిరూపించిన కవలలు
శాకాహారమా? లేక మాంసాహారమా? ఏది ఆరోగ్యానికి మంచిది | ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది. శాకాహారమా.. లేక మాంసాహారమా.. అంటే చాలామంది శాకాహారం అని బల్లగుద్ది మరీ చెబుతారు. కొందరు మాత్రం మాంసాహారం కూడా ఆరోగ్యానికి మంచిదే
ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది. శాకాహారమా.. లేక మాంసాహారమా.. అంటే చాలామంది శాకాహారం అని బల్లగుద్ది మరీ చెబుతారు. కొందరు మాత్రం మాంసాహారం కూడా ఆరోగ్యానికి మంచిదే. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు, బీ12 లాంటి కొన్ని విటమిన్స్.. మాంసాహారంలోనే ఎక్కువగా దొరుకుతాయని… మాంసాహారం తింటేనే మనిషి బలంగా తయారవుతాడని అంటారు. వీటిలో దేన్ని నమ్మాలి అనేదానిపై అస్సలు క్లారిటీ ఉండదు.

అందుకే.. ఓ కవల జంట.. శాకాహారం తింటే మంచిదా.. లేక మాంసాహారం తింటే మంచిదా అనేదానిపై ఏకంగా వాళ్ల మీదనే రీసెర్చ్ చేసుకున్నారు. ఆ రీసెర్చ్‌లో ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి.
లండన్‌కు చెందిన హుగో, రోస్ టర్నర్.. ఇద్దరూ కింగ్స్ కాలేజీ లండన్‌లో శాకాహారం, మాంసాహారంలో ఏది ఆరోగ్యకరం అనే దానిపై రీసెర్చ్ చేస్తున్నారు. దానిలో భాగంగా 12 వారాల పాటు.. ఇద్దరిలో ఒకరు పూర్తిగా శాకాహారం, మరొకరు పూర్తిగా మాంసాహారాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి శరీరాల్లో జరిగిన మార్పులను గమనించి షాక్ అయ్యారు.
హుగో… 12 వారాల పాటు.. పూర్తిగా నాన్ వెజ్ తినడం మానేశాడు. డెయిరీకి సంబంధించిన పదార్థాలను కూడా తీసుకోలేదు. ఫ్రూట్స్, నట్స్, కూరగాయలు ఎక్కువగా తీసుకున్నాడు. రోస్ మాత్రం ప్రతి రోజు 12 వారాల పాటు పాల ఉత్పత్తులతో పాటు మాంసం, చేపలు తీసుకున్నాడు.
హుగోకు 12 వారాల సమయంలో షుగర్ లేవల్స్ నార్మల్‌గా ఉన్నాయి. రోజూ యాక్టివ్‌గా, ఎనర్జీతో ఉన్నాడు. మాంసం తినే రోస్ మాత్రం కొన్ని రోజులు యాక్టివ్‌గా మరికొన్ని రోజులు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించారు. అలాగే.. హుగో శరీరంలో ఉన్న గట్ బ్యాక్టీరియాలోను మార్పులు రావడం గమనించారు. వాటి శాతం క్రమక్రమంగా హుగోలో తగ్గింది. కానీ.. నాన్ వెజ్ తిన్న రోస్ శరీరంలో మాత్రం ఎటువంటి మార్పు కనబడలేదు.
12 వారాల తర్వాత.. హుగో బరువు తగ్గాడు. బాడీలోని కొలెస్టరాల్ లేవల్స్ తగ్గాయి. 185 పౌండ్స్ నుంచి 181 పౌండ్స్‌కు వచ్చాడు. రోస్ మాత్రం బరువు పెరిగాడు. 189 పౌండ్స్‌కు పెరిగాడు. శరీరంలో ఫ్యాట్ కూడా పెరిగింది.
ఆ కవల జంట ఆచరణాత్మక పరిశోధన ప్రకారం.. మాంసాహారం కన్నా.. శాకాహారం తింటేనే ఆరోగ్యంగా ఉంటారని రుజువైంది. నిత్యం నాన్ వెజ్ తినడం వల్ల బరువు పెరగడం, బాడీలో ఫ్యాట్ పెరగడం.. ఇతర సమస్యలు పెరుగుతాయని వాళ్లు తమ స్టడీ ద్వారా తెలుసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
Popcorn | పాప్‌కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్మాస్టర్ : వీడియో
Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

