వెన్ను తట్టే విజయం

మన శరీరంలో వెన్నెముక, మెదడు చాలా సంక్లిష్టమైన భాగాలు. ఒక్కసారి దెబ్బతింటే, మళ్లీ మామూలు స్థితికి రావడం దాదాపుగా అసాధ్యం. అందుకే, వెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్న వారు, మంచానికే పరిమితం అవుతుంటారు. ఈ పరిమితిని త్వరలోనే జయించబోతున్నాం. అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇందుకు కచ్చితమైన మందును కనిపెట్టామని చెబుతున్నారు. ఇందుకోసం వారు నానోఫైబర్ పదార్థాలను నేరుగా గాయపడినచోటికి ఇంజక్షన్ రూపంలో పంపుతారు. ఇవి అక్కడున్న న్యూరాన్లను ఉత్తేజపరిచి వాటి సంఖ్య పెరిగేలా చేస్తాయి. గాయపడిన కణజాలం (స్కార్ టిష్యూ) కోలుకునేలా, రక్త ప్రసరణ పెరిగేలా, మెదడుతో సంకేతాలు మెరుగయ్యేలా… మొత్తానికి అన్ని విధాలా పూర్వ దశకు చేరుకునేలా సాయపడుతాయి. ఈ విధానాన్ని ఎలుకల మీద ప్రయోగించి విజయం సాధించామనీ, ఇక మనుషులకు అన్వయించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడమే ఆలస్యమని చెబుతున్నారు పరిశోధకులు. ఈ చికిత్సతో అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి సమస్యలను నివారించే అవకాశాలు లేకపోలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

