అర్హులకు అన్యాయం జరుగనివ్వం.. సర్‌పై పకడ్బందీగా సమీక్షిస్తాం.. కేటీఆర్
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగకుండా చర్యలు చేపడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
- రాష్ట్రంలో 74 లక్షల ఓట్లు అన్ కలెక్టబుల్గా ఉండటం ఆందోళనకరం
- ముసాయిదా ఓటరు జాబితా తర్వాత జిల్లాలవారీగా సమావేశాలు పెడుతాం
- న్యాయపరంగా, పార్టీ పరంగా అర్హుల ఓట్ల పరిరక్షణకు కార్యాచరణ చేపడుతాం
హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగకుండా చర్యలు చేపడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేసి, ఓటర్లకు అవసరమైన న్యాయసహాయం అందిస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ ‘సర్’ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఓటర్లకు ఎదురవుతున్న సమస్యలు, అర్హులైన ఓట్లరు తొలగిపోకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘సర్’ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో సుమారు 3.39 కోట్ల ఓట్లు ఉంటే.. ఎన్యుమరేషన్ ఫారాల సమర్ప ణ గడువు ముగిసిన తర్వాత అందులో దాదా పు 74లక్షల ఓట్లు ‘అన్ కలెక్టబుల్’గా ఉన్నాయని తెలిపారు. ఇంత పెద్దసంఖ్యలో ఓట్లు అన్ కలెక్టబుల్గా ఉండటం, వాటిలో చాలా ఓట్లు తొలగించబడే అవకాశం ఉండటం ఆం దోళన కలిగిస్తున్నదని చెప్పారు. మరో 60 లక్ష ల ఓట్లలో లోపాలు ఉన్నట్టు సమాచారం ఉ న్నదని తెలిపారు. మొత్తంగా రెండు కోట్ల ఓట్లు మాత్రమే ఎలాంటి సమస్యలు లేకుండా మిగిలే పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పారు. మిగిలిన ఓట్లలో కొన్ని తొలగిపోయే అవకాశం ఉండగా, మరికొన్నింటిలో తప్పులు, అనుమానాలు ఉన్నట్టు ఎన్నికల కమిషన్ నుంచి సమాచారం వస్తున్నదని తెలిపారు.
రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహిస్తాం..
ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామని సీఈవో కార్యాలయం ప్రకటించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ జాబితా ప్రచురణ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలవారీగా పార్టీ సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. ఇప్పటికే పార్టీ లీగల్ సెల్‌తో సమావేశమై, న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకున్నామని తెలిపారు. అర్హుల పేర్లు జాబితా నుంచి తొలగిపోతే ఏం చేయాలనే దానిపై న్యాయ నిపుణులతో చర్చించామని కేటీఆర్ చెప్పారు.
ఈ నెల 13, 14 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నామని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు, కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు. జిల్లాలవారీగా జరిగే సమావేశాల్లో స్థానిక పరిస్థితులను సమీక్షించి, అర్హులైన ఓటర్ల హకులను కాపాడేందుకు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు వై సతీశ్‌రెడ్డి, సుమిత్రా ఆనంద్, మన్నె క్రిశాంక్, రంగినేని అభిలాష్, ముజీబ్, చల్మెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KTR
- SSR
- Voter List
- Voters
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

