నీళ్లపాలు.. ఓ పరిశోధన

ఇప్పుడంతా పాల ప్యాకెట్ల హవా! వాటిలోని కొవ్వు శాతాన్ని బట్టి రకరకాల ధరల్లో దొరుకుతున్నాయి. చిన్న పిల్లల జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, వారికి కొవ్వు తక్కువగా ఉండే పాలనే పట్టించాలని చెబుతూ ఉంటారు. లేకపోతే పసివయసులోనే ఊబకాయం, జీర్ణసమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉంటారు. ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలని అనుకున్నారు ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. దీనికోసం వారు 4 నుంచి 6 ఏండ్ల వయసున్న 49 మంది పిల్లలను ఎంచుకున్నారు. వారిలో కొంతమందికి కొవ్వు తక్కువగా ఉన్న పాలు, మరికొందరికి చిక్కటి పాలు అందించారు. ఓ మూడు నెలలు గడిచిన తర్వాత చూస్తే… ఇరు జట్లలో ఉన్న పిల్లల ఆరోగ్యం, బరువు ఒకే తీరున కనిపించాయి. దీంతో, పాలల్లో కొవ్వు ఎక్కువ తక్కువల సమస్య ఓ అపోహేనని తేల్చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

