బెంగళూర్ : పలు అంశాలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రస్తుతం వినోదాత్మక, క్రియేటివ్ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహాలోనే బెంగళూర్‌లో ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి ప్రజలను మెయిన్ రోడ్‌పై వాహనాలను పార్క్ చేయవద్దని సూచించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
" Don't park on main road " pic.twitter.com/Z8OYGBZmDR
— Kala Krishnaswamy, IPS DCP Traffic East (@DCPTrEastBCP) January 3, 2023
ఓ ఏనుగు రోడ్డు మీదకు దూసుకొచ్చి స్ధానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ రోడ్డుపై పార్క్ చేసిన వాహనాన్ని నెట్టివేసిన పాత వీడియోను ఐపీఎస్ అధికారి కళా కృష్ణస్వామి షేర్ చేశారు. బెంగళూర్ డీసీపీ ట్రాఫిక్ (ఈస్ట్ డివిజన్) కళా కృష్ణస్వామి ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో పలువురిని ఆకట్టుకుంటోంది. మలప్పురం నుంచి రికార్డయిన ఈ షార్ట్క్లిప్లో వైల్డ్ ఎలిఫెంట్ రోడ్డుపైనున్న ప్రజల పైకి దూసుకురావడం కనిపించింది.
ఏనుగు నుంచి తప్పించుకునేందుకు ప్రజలు తలోదిక్కు పరిగెత్తగా రోడ్‌పై పార్క్ చేసిన మోటార్ బైక్‌ను అది నెట్టివేస్తుంది. మెయిన్ రోడ్‌పై పార్క్ చేయకండని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటినుంచి 5 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ట్విట్టర్ యూజర్లు ఐపీఎస్ అధికారి క్రియేటివిటీని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. పోలీసులు హాస్య ధోరణిలో ప్రజల్లో అవగాహన పెంచడం బావుందని ఓ యూజర్ కామెంట్ చేయగా, దయచేసి మెయిన్ రోడ్‌పై వాహనాలు నిలపకండని మరో యూజర్ రాసుకొచ్చారు.