e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News పెండ్లికి ముందే శృంగారం.. మైన‌ర్ బాలిక‌కు గ‌ర్భం.. యూట్యూబ్ వీడియో చూస్తూ సీక్రెట్‌గా డెలివ‌రీ..!

పెండ్లికి ముందే శృంగారం.. మైన‌ర్ బాలిక‌కు గ‌ర్భం.. యూట్యూబ్ వీడియో చూస్తూ సీక్రెట్‌గా డెలివ‌రీ..!

హైద‌రాబాద్‌: ఓ 17 ఏండ్ల బాలిక పెండ్లికి ముందే కాబోయే భ‌ర్త‌తో శృంగారంలో పాల్గొన్న‌ది. గ‌ర్భం రావ‌డంతో ఇంట్లో త‌ల్లికి తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డింది. తీరా డెలివ‌రీ స‌మ‌యం రావ‌డంతో యూట్యూబ్ వీడియోలు చూసి స్వ‌యంగా త‌న‌కు తానే డెలివ‌రీ చేసుకున్న‌ది. పాక్షికంగా అంధురాలు అయిన బాలిక త‌ల్లికి ప‌సికందు ఏడుపు వినిపించ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వైద్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి.. ఘ‌ట‌న‌కు బాధ్యుడైన 21 ఏండ్ల యువ‌కుడిని అరెస్ట్ చేశారు.

కేర‌ళ‌లోని మ‌ల‌ప్పురం జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. పాక్షికంగా అంధురాలైన ఓ మ‌హిళ త‌న 17 ఏండ్ల కూతురుతో క‌లిసి జిల్లాలోని కొట్టకల్‌ ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న‌ది. ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆమె కుమార్తె ఓ 21 ఏండ్ల‌ యువకుడితో ప్రేమ‌లో ప‌డింది. విష‌యం బ‌య‌టికి రావ‌డంతో పెద్ద‌లు వారి పెండ్లికి అంగీకరించారు. అయితే, బాలిక మైన‌ర్ కావ‌డంతో ఆమెకు 18 ఏండ్లు నిండిన త‌ర్వాత పెండ్లి చేయాల‌ని నిర్ణ‌యించారు.

- Advertisement -

కానీ, బాలిక మాత్రం త‌న కాబోయే భ‌ర్తేగా అనుకుందో ఏమోగానీ తాను ప్రేమించిన యువ‌కుడితో శృంగారంలో పాల్గొన్న‌ది. దాంతో ఆమె గ‌ర్భం దాల్చింది. అయితే ఈ విష‌యం త‌న త‌ల్లికి తెలియ‌కుండా జాగ్ర‌త్తప‌డింది. తీరా డెలివ‌రీ స‌మ‌యం రావ‌డంతో ఈ నెల 20న యూట్యూబ్‌ వీడియో సాయంతో సొంతంగా డెలివ‌రీ చేసుకుని ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. బొడ్డుతాడు కూడా కత్తిరించుకుంది. ఆమె త‌ల్లికి బిడ్డ ఏడుపు వినప‌డ‌టంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

అయితే, డెలివ‌రీ అనంత‌రం బాలింత‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోక‌డంతో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. వైద్యులు విష‌యం తెలుసుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేశారు. బాధిత బాలికను, ఆమె త‌ల్లిని విచారించి ఘ‌ట‌న‌కు బాధ్యుడైన యువ‌కుడిని అరెస్ట్ చేశారు. అత‌నిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. కాగా, ప్రస్తుతం ఆస్ప‌త్రిలో త‌ల్లీబిడ్డ ఇద్ద‌రూ క్షేమంగానే ఉన్నార‌ని వైద్యులు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement