Doctor Message | రిఫైన్డ్ ఆయిల్, చక్కెర తినకండి.. కరీంనగర్ వైద్యుడి భావోద్వేగ సందేశం.. Video
Doctor Message | ప్రజలు ఆరోగ్యానికి హానిచేసే ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వైద్యుడు కోరారు. జనం ఎంత చెప్పినా తమ అనారోగ్యకర ఆహరపు అలవాట్లను మార్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. 'ఇప్పటికైనా నా మాట వినండి. రిఫైన్డ్ ఆయిల్, చక్కెర జోలికి వెళ్లకండి. వాటివల్ల క్యాన్సర్ సహా పలు ప్రాణాంతక వ్యాధుల బారినపడాల్సి వస్తుంది' అని తన దగ్గరికి వచ్చిన రోగులను భావోద్వేగంతో ఆయన వేడుకున్నాడు.
కరీంనగర్ : ప్రజలు ఆరోగ్యానికి హానిచేసే ఆహార పదార్థాల జోలికి వెళ్లకూడదని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వైద్యుడు కోరారు. జనం ఎంత చెప్పినా తమ అనారోగ్యకర ఆహరపు అలవాట్లను మార్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇప్పటికైనా నా మాట వినండి. రిఫైన్డ్ ఆయిల్, చక్కెర జోలికి వెళ్లకండి. వాటివల్ల క్యాన్సర్ సహా పలు ప్రాణాంతక వ్యాధుల బారినపడాల్సి వస్తుంది’ అని తన దగ్గరికి వచ్చిన రోగులను భావోద్వేగంతో ఆయన వేడుకున్నాడు. ఈ సందేశానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
రిఫైన్డ్ ఆయిల్, చక్కెర లాంటివి తిని ఆరోగ్యాలను పాడుచేసుకోవద్దని ఆ వీడియోలో వైద్యుడు వేడుకున్నారు. గానుగ నూనెను మాత్రమే వాడాలని సూచించారు. పిల్లలను మనం ఎంతో ప్రేమగా పెంచుకుంటామని, వాళ్లకు కూడా ఆరోగ్యాలను చెగగొట్టే చిప్స్, చాక్లెట్స్ లాంటివి తినిపించకూడదని చెప్పారు. బయటి ఆహార పదార్థాలను తినకూడదని, అవి ఆరోగ్యాలను పాడుచేస్తాయని అన్నారు. ఇంట్లోని వంటచేసుకుని తినాలని సూచించారు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు వైద్యుడి ఆవేదన చూసి ఫిదా అయ్యారు. డాక్టర్ అంటే ఇలా వుండాలని ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కరీంనగర్ వైద్యుడి భావోగ్వేద సందేశం 🥺
దయచేసి రిఫైండ్ ఆయిల్, చెక్కర వాడకండి వాటి వాడకం వలన కాన్సర్ సహా పలు ఆరోగ్య సమస్యలు వస్తాయ్ అనీ తన దగ్గరికి వచ్చిన పేటెంట్స్ కి చెప్పుతూ భావోద్వేగనీకీ లోనైన వైద్యుడు.
వైద్యుడి వీడియో సందేశం చూసి డాక్టర్ అంటే ఇలా… pic.twitter.com/IGHzbBYDp6
— TRPartyOfficial (@TRPartyOfficial) March 31, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

