ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతాయి. ఎన్నో మిస్టరీలుగా మిగిలిపోతాయి. అందులో ఒకటి ఈ వింత ఐలాండ్. గూగుల్ మ్యాప్స్ లో బయటపడింది. ఈ వింత ఐలాండ్ కు సంబంధించిన ఫోటోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చూస్తే మొత్తం బ్లాక్ ఔట్ లా కనిపించిన ఆ ఐలాండ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముందు ఆ ఐలాండ్ ఫోటోను రెడిట్ లో షేర్ చేశారు. పైనుంచి చూస్తే గిటార్ లా ఉన్న ఈ ఐలాండ్ ను చూసి కొందరు నెటిజన్లు.. ఈ ఐలాండ్ ను ఏరియా 51 లా కవర్ చేసి ఉంటారని అందుకే అది పైనుంచి అలా బ్లాక్ ఔట్ లా కనిపిస్తోందని అంటున్నారు.
ఇలా గూగుల్ మ్యాప్స్ లో బ్లాక్ ఔట్ ప్రాంతాలు కనిపించడం ఇదే కొత్తేమీ కాదు. కొన్ని హైసెక్యూరిటీ ప్రాంతాలను కూడా మ్యాప్స్ లో గుర్తించారు. తాజాగా బయటపడిన ఈ ఐలాండ్.. బయట లైట్ బ్లూ సముద్రం అలలు ఆ ఐలాండ్ ను తాకుతూ.. ఆ ఐలాండ్ కు సరికొత్త రూపును ఇస్తున్నాయి. దాని వెనుక రెండు గ్రే రంగు లేయర్స్ ఉన్నాయి. మధ్యలో వైట్ కలర్ లేయర్ ను కూడా చూడొచ్చు. ఇది యూఎస్ లో ఉంది. ఈ మిస్టీరియస్ ఐలాండ్ లోకి వెళ్లడానికి ఇప్పటి వరకు అయితే ఎవ్వరూ సాహసించలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
DC FanDome 2021 : డీసీ ఫ్యాన్ డోమ్ 2021 ఈవెంట్ ను ఇండియాలో ఎలా చూడాలి?
Bride Dance : పప్పు కాంట్ డ్యాన్స్ సాలా… అంటూ అదరగొట్టిన పెళ్లికూతురు.. వీడియో వైరల్