SDT19 Announcement | టాలీవుడ్ సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తన కెరీర్లో 19వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. #SDT19 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. యుగాల నాటి రహస్యాలు, ఊహకు అందని అద్భుత శక్తుల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ‘క’ (KA) చిత్రంతో టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన యువ దర్శకులు సుజిత్ మరియు సందీప్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా దర్శకత్వం వహించబోతున్నారు. వారి గత చిత్రంలాగే ఈ సినిమా కూడా సరికొత్త స్క్రీన్‌ప్లే, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై నిర్మాత సాహు గారపాటి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ సినిమాతో సాయి దుర్గ తేజ్ తన తల్లి పేరిట ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’ అనే సొంత బ్యానర్‌ను స్థాపించి తొలిసారిగా నిర్మాణ భాగస్వామిగా మారుతుండటం విశేషం. ఇక విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్‌ను చూస్తుంటే.. ఒక దట్టమైన అడవి ప్రాంతంలో సాయి దుర్గ తేజ్ ఒక శక్తివంతమైన యోధుడిలా నిలబడి ఆకాశం వైపు తీక్షణంగా చూస్తున్నట్లు ఇందులో చూపించారు. ఆకాశంలో వింతైన మేఘాలు, ఒక రహస్యమైన పర్వతం, దాని చుట్టూ అంతుచిక్కని అద్భుత కాంతి పుంజాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ‘యుగాల నాటి రహస్యాలు.. ఊహకు అందని అపరిమితమైన శక్తి’ అనే క్యాప్షన్ ఇవ్వడంతో ఇదొక మైథలాజికల్ టచ్ ఉన్న కాస్మిక్ అడ్వెంచర్ డ్రామా అని స్పష్టమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది.
Secrets of the Ages… Power beyond imagination.
Stepping into something truly powerful…
Excited to be part of this journey with the Dynamic directors @Dir_Sujith & @Dir_SandeepM and Passionate Producer @Sahugarapati7 anna#SDT19 #CosmicChronicles @Shine_Screens… pic.twitter.com/OxXyLhUK6S
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 3, 2026