Bandla Ganesh | బండ్ల గణేష్ ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభం.. ఘనంగా పసుపు కుంకుమ వేడుక
Bandla Ganesh | తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ ఇంట ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. తనదైన వాక్చాతుర్యంతో, అలాగే పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆయన, ఇప్పుడు తన కుమార్తె వివాహ వేడుకలతో హాట్ టాపిక్‌గా మారారు.
Bandla Ganesh | తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ ఇంట ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. తనదైన వాక్చాతుర్యంతో, అలాగే పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆయన, ఇప్పుడు తన కుమార్తె వివాహ వేడుకలతో హాట్ టాపిక్‌గా మారారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ కుమార్తె జనని బండ్ల వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టారు. తొలి కార్యక్రమంగా ఇంట్లో ‘పసుపు కుంకుమ’ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.. దేవుడి ఆశీస్సులు, పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం. చిరంజీవి సూర్యతేజ చిలుకూరి, లక్ష్మీ సౌభాగ్యవతి జనని బండ్లల వివాహ సందర్భంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించాం అని బండ్ల గణేష్ తన పోస్టులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోల్లో ఆయన ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది.ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో జనని వివాహంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బండ్ల గణేష్ మొదట నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం నిర్మాతగా మారి టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ కెరీర్‌ను నిర్మించుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం భారీ విజయాన్ని అందించి ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ‘బాద్ షా’, ‘టెంపర్’, రామ్ చరణ్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి సినిమాలను నిర్మించి టాప్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. 2015లో వచ్చిన ‘టెంపర్’ తర్వాత కొంతకాలం సినీ నిర్మాణానికి దూరంగా ఉన్న బండ్ల గణేష్, ఇప్పుడు మళ్లీ నిర్మాతగా రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈసారి ‘BG Blockbusters’ అనే కొత్త బ్యానర్‌ను ప్రారంభించి, కంటెంట్ ఆధారిత సినిమాలను తెరకెక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

