కోల్‌కతా: పశ్చిమ బెంగాల్(West Bengal)లోని మాల్దా జిల్లాలో ఏడు మంది జుడిషియల్ అధికారుల్ని బుధవారం నిరసనకారులు ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు చెందిన మాస్టర్‌మైండ్‌ను శుక్రవారం బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. సిలిగురిలోని బగ్డోగ్రా ఎయిర్‌పోర్టు నుంచి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మొఫక్కరుల్ ఇస్లామ్‌గా గుర్తించారు. అతను ఓ అడ్వకేట్. అయితే విమానం ఎక్కేందుకు వెళ్లిన అతన్ని అరెస్టు చేశారు. కాలియాచాక్లో జరిగిన ఘటనలో అతనే మాస్టర్‌మైండ్ అని, ఓ బీడీఓ ఆఫీసులో ఏడు మంది జడ్జీలను నిర్బంధించారని, పారిపోయేందుకు అతను ఫ్లయిట్ ఎక్కే సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. అయితే జుడిషియల్ అధికారుల్ని నిర్బంధించిన ఘటనలో ఇప్పటి వరకు పోలీసులు 33 మందిని అరెస్టు చేశారు. దాంట్లో ఓ ఐఎస్ఎఫ్ అభ్యర్థి కూడా ఉన్నారు.
#WATCH | West Bengal | Mofakkarul Islam, the alleged mastermind of Kaliachak incident in Malda, was detained by CID at Bagdogra airport
He says, “The protest will continue till the names of the deleted voters get included in the list…” https://t.co/O4mgtTpRqY pic.twitter.com/xAHhjDMvkn
— ANI (@ANI) April 3, 2026
అసలేం జరిగిందంటే..
అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించడం తీవ్ర దుమారం రేపింది. బెంగాల్ పాలనా యంత్రాంగంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనను నేరపూరిత వైఫల్యంగా అభివర్ణించిన ధర్మాసనం.. ఈ ఉదంతంపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలంటూ ఎన్నికల సంఘానికి (ఈసీ) సూచించింది. అలాగే సర్ ప్రక్రియకు అడ్డంకులు కలుగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీని ఆదేశించింది.
Reports from Malda, West Bengal, are deeply concerning.
A man allegedly provoked a mob to Gherao 7 judges during an anti-SIR protest. While some are confusing the visuals with Bangladesh, this incident highlights a serious breakdown of law and order right here in our own… pic.twitter.com/EZfidnAVea
— Arpit (@ag_arpit1) April 3, 2026