Viral Video | పాము.. ఈ పేరు విన్నా, చూసినా ఆమడదూరం పరిగెడతాం. అదే పాము మనతో పాటు కొంతదూరం ప్రయాణిస్తే ..! ఇంకేమైనా ఉందా…? ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి మధ్య ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్సింగ్‌పూర్‌కు చెందిన నజిర్ఖాన్ అనే వ్యక్తి రాత్రి సమయంలో తన బైక్‌ను ఇంటి ముందు పార్క్ చేశాడు. తెల్లవారగానే ఏదో పనిమీద బైక్‌పై పయణమయ్యాడు. కొంతదూరం వెళ్లగానే బైక్‌లో నుంచి పాము బుసకొడుతున్న శబ్దం వచ్చింది. దీంతో నజిర్.. బైక్‌ను పక్కకు ఆపి పరిశీలించగా స్పీడోమీటర్‌లో నల్లటి నాగు పాము కనిపించింది. బైక్‌లోకి పాము ఎలా వచ్చిందో అర్థంకాకా కంగుతిన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా.. స్థానికులంతా అక్కడకు చేరుకున్నారు. పామును బయటకు తీసే ప్రయత్నం చేశారు. కొన్ని గంటలు శ్రమించి స్పీడోమీటర్ అద్దం పగలగొట్టి పామును బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
: नरसिंहपुर में मोटरसाइकिल के मीटर में घुसा सांप pic.twitter.com/W8Dcu6fzoG
— NaiDunia (@Nai_Dunia) October 17, 2022