మదర్స్ డే సందర్భంగా తమ తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలను ఒక్కొక్కరు ఒక్కో రంగా పంచుకున్నారు. సినిమా హీరోలు, స్పోర్ట్స్ స్టార్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు మొదలుకొని సాధారణ వ్యక్తుల వరకు తాము అమ్మలతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనాటి అనుభూతులను నెమరేసుకున్నారు.
ఇలాంటి ఓ వ్యక్తి అచ్చం అలాగే తన చిన్ననాటి ఫొటోను పంచుకుని తనకు అమ్మతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఈ ఫొటోలో ముద్దుగా , వెండి రంగులో మెరిసిపోతున్న వెంట్రుకలతో.. తమ్ముడ్ని ఒడిసిపట్టుకుని అమ్మ పక్కన కూర్చుని ఉన్న ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? ఎందరో వినియోగదారులను తన సేవలతో ఆకట్టుకుని ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న అమెజాన్ సంస్థ సీఈఓ జెఫ్ బెజోస్. ఈయన ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడని చెప్పనక్కర్లేదు.
మదర్స్ డే సందర్భంగా “ఎప్పుడూ తన చేతులను నిండుగా ఉంచుకునే తల్లీ.. కచ్చితంగా అన్నింటికీ నీకు ధన్యవాదాలు. మేం నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం అమ్మా” అన్న క్యాప్షన్‌తో త్రో బ్యాక్ ఫొటోను జెఫ్ బెజోస్ ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. అతను తన తల్లి జాక్లిన్ బెజోస్, తోబుట్టువులతో కూర్చుని ఉన్నాడు. జెఫ్ బెజోస్‌కు చెల్లెలు క్రిస్టినా, సోదరుడు మార్క్ ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, జెఫ్ బెజోస్ ప్రస్తుతం 192 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన ప్రపంచంలో అత్యంత ధనవంతుడు.
No matter how old you get, the memory of your mother holding you securely cannot be erased. It’s probably the foundation of our lifelong feelings of confidence. Happy Mother’s Day, Ma. Thank you for holding on tight…(and for letting me steal your sunglasses as well! 😊) pic.twitter.com/g8Zs0i56vq
— anand mahindra (@anandmahindra) May 9, 2021
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా మదర్స్ డే సందర్భంగా తన తల్లి, దివంగత ఇందిరా మహీంద్రా జ్ఞాపకార్థం త్రో బ్యాక్ ఫొటోను పంచుకున్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ తన వ్యక్తిగత ఆల్బమ్ నుంచి ఈ అరుదైన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. తల్లితో పసిబిడ్డగా ఉన్నప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేశారు.
ప్రైవసీ పాలసీని గడువు వాయిదా వేసుకున్న వాట్సాప్.. ఎందుకో తెలుసా..?
అమెరికా చమురు పైప్‌లైన్‌పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
మాడ్రిడ్ ఓపెన్ : రెండోసారి టైటిల్ గెల్చుకున్న జ్వెరెవ్
దక్షిణాఫ్రికా దేశాధ్యక్ష పీఠంపై నెల్సన్ మండేలా.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల 1 నుంచి నిలిచిపోనున్న గూగుల్ ఉచిత సేవలు
రెమ్‌డెసివిర్ అమ్ముతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వైద్యుడు.. వీడియో వైరల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..