Viral Video | భార్యాభర్తల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటూ.. ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటుంటారు. తాజాగా, అలాంటి ఘటనే ఒకటి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఓ వ్యక్తి తన భార్యకు ఎంతో ప్రేమతో నెయిల్ పాలిష్ పెడుతూ.. ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలూమగల మధ్య ప్రేమ, అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది అనడానికి ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది.
వీడియోలో దంపతులు రైలు కంపార్ట్మెంట్లో ఎదురెదురు బెర్తులపై కూర్చొని ఉంటారు. మహిళ తన భర్త బెర్తుపై కాలు పెట్టగా.. అతను ఎంతో శ్రద్ధగా ఆమె కాలి వేలికి నెయిల్ పాలిష్ వేస్తూ కనిపిస్తాడు. అయితే, ఆ వ్యక్తి పబ్లిక్‌లో తన భార్య కాలికి నెయిల్ పాలిష్ వేయడం విశేషం.
దిలీప్ సోలంకి అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ‘సో క్యూట్..’, ‘‘భార్య అంటే ఎంత ప్రేమ.. ’’, ‘‘ఇలాంటి మధుర క్షణాల కోసం నేనూ ఎదురు చూస్తున్నా’’ అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియో చూసేయండి.