Man Kicks Cow | హిందువులు గోమాతను ఎంతో భక్తితో కొలుస్తారు. ఆవుకు అపకారం తలపెట్టే పని మాత్రం చెయ్యరు. అలాంటి గోమాత పట్ల ఓ వ్యక్తి కర్కశంగా వ్యవహరించారు. తాళ్లతో కట్టేసి విచక్షణా రహితంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి ఆవును కదలకుండా తాళ్లతో కట్టేశాడు. అనంతరం కాళ్లతో విచక్షణా రహితంగా తన్నాడు. ఈ క్రమంలో ఆవు అతని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ సదరు వ్యక్తి గోమాత తోక పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన గోమాత ఒక్కసారిగా ఆ వ్యక్తిపైకి విరుచుకుపడింది. కొమ్ములతో కుమ్ముతూ.. కింద పడేసి కాళ్లతో తొక్కుతూ సదరు వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఈ ఘటనను అక్కడే ఉన్న పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. ఇది కాస్తా వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు గోమాతపట్ల ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Kalesh With Animal (Cow-Gang Assemble 💪) pic.twitter.com/JaOHU7WjRo
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 13, 2022