హైదరాబాద్: సాధారణంగా పాములంటే ఎవరికైనా చచ్చేంత భయం. పాము కనిపించిందంటే చాలు జడుచుకుని ఆమడ దూరం పరుగుపెడుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం పాముకు భయపడలేదు సరికదా దానితో ఓ ఆటాడుకున్నాడు. ఓ కంపెనీలో పాము చొరబడిందంటే అక్కడి వెళ్లి దాన్ని అవలీలగా పట్టేశాడు. అనంతరం దాన్ని తాను కట్టుకున్న లుంగీలో వేసుకుని అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయాడు.
అయితే, ఇది ఇప్పుడు జరిగిన ఘటన కాదు. గతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అప్పట్లో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతా నంద తన ట్విటర్లో షేర్ చేశాడు. ‘లుంగీని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. తాజాగా ఓ ట్విటర్ యూజర్ ఆ వీడియోను మళ్లీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నది. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
భారీగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తయారీ.. ఇస్రో కీలక నిర్ణయం..!
సహజీవనం ఆమోదయోగ్యం కాదు: పంజాబ్, హర్యానా హైకోర్టు
కొవిడ్‌పై యుద్ధం ప్రతి ప్రాణాన్ని కాపాడేలా ఉండాలి: ప్రధాని మోదీ