కేటాయింపుల్లో 2 శాతమే ఖర్చు
రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దగా మరోసారి బట్టబయలైంది. ఆయా తరగతుల కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్.. ఆ ని ధుల్లో ఖర్చు చేసింది చాలా తక్కువేనని స్వయంగా అంగీకరించింది.
- కార్పొరేషన్లకు రూ.14,522 కోట్లు కేటాయింపు
- ఇప్పటివరకు చేసిన ఖర్చు మాత్రం రూ.305.6 కోట్లే
- అంగీకరించిన కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దగా మరోసారి బట్టబయలైంది. ఆయా తరగతుల కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్.. ఆ ని ధుల్లో ఖర్చు చేసింది చాలా తక్కువేనని స్వయంగా అంగీకరించింది. ఈ అంశంపై బుధవారం శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లతోపాటు ఇతర కార్పొరేషన్లు, వివిధ ఫెడరేషన్లకు గత రెండున్నరేండ్లలో ఎన్ని నిధులు కేటాయించారు? అందులో ఎన్ని నిధులు విడుదల చేశా రు? ఎన్ని నిధులు ఖర్చు చేశారు? అని నిలదీశారు. దీంతో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కార్పొరేషన్లు, ఫెడరేషన్లు తదితర 33 సంస్థలకు రూ. 14,522 కోట్లు కేటాయించి, రూ. 3,198.07 కోట్లు విడుదల చేశామని, అందులో రూ.305.6 కోట్లు (2.10 శాతం) మాత్రమే ఖర్చు చేశామని వెల్లడించింది.

(నోట్: 16 సంస్థలకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. మొత్తంగా 33 సంస్థల్లో 22 సంస్థలకు నయాపైసా విడుదల చేయలేదు)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

