Mandhana – Palash : టీమిండియా తొలిసారి విశ్వవిజేతగా అవతరించిన రోజు నుంచి నెట్టింట వైరలైన స్మృతి మంధాన(Smriti Mandhana) – పలాశ్ ముచ్చల్( – Palash Muchhal) లవ్ స్టోరీ కంచికి చేరింది. ఉత్కంఠ రేపిన టీ20 మ్యాచ్‌లా.. ఆశ్చర్యానికి గురిచేసే సినిమా క్లైమాక్స్‌లా గత పదిరోజులుగా మీడియాలో వైరలైన వీరి అనుబంధం ముగిసింది. గత ఎవరి కంటపండకుండా ఆరేళ్లుగా ప్రేమ పక్షుల్లా తిరిగి.. పెళ్లికి సిద్ధమైన ఈ జంట కనులపంట అవుతుందనుకున్నారంతా. కానీ, ఊహించని ట్విస్ట్‌లు.. సోషల్ మీడియాలో ‘పలాశ్ ఛీటర్’ అనే పోస్ట్‌లు విసిగెత్తించిన వేళ.. పెళ్లి రద్దు వార్తను ధ్రువీకరించారు ఇద్దరు. అసలు.. మంధాన- పలాశ్ లవ్ ట్రాక్‌లో విడిపోవాల్సినంతగా ఏం జరిగింది? అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఏదో విషయం జరిగే ఉంటుంది? లేదంటే పెళ్లిని రద్దు చేసుకుంటారా? అనేది పలువురి వాదన. ఈ అనూహ్య పరిణామానికి బాధ్యులు ఎవరైనా.. బ్రేకప్ బాధ మాత్రం ఇద్దరిది.
ఇష్టం.. అంతులేని నమ్మకంతో మొదలైన మంధాన – పలాశ్ ప్రేమకు ఇలాంటి ఎండ్ కార్డ్ పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. నవంబర్ 23న పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాల్సిన ఈ జంట బ్రేకప్ చెప్పేసుకుంది. యావత్ ప్రపంచం ఆసక్తి చూపిన మంధాన – పలాశ్ వివాహం రద్దుకు దారితీసిన పరిస్థితులు ఏంటంటే.. సంగీత్ వేడుక తర్వాత కొరియోగ్రాఫర్ నందికా దివేది (Nandika Divedi)తో పలాశ్‌కు అఫైర్ ఉందనే వార్త లీకైంది. వారి మధ్య జరిగిన ఛాటింగ్ బయటకు రావడం మంధాన – పలాశ్ ముచ్చల్ మధ్య దూరం పెంచాయి. ‘పలాశ్ ఛీటర్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా మంధానను యూ టర్న్ తీసుకునేలా చేసి ఉంటాయని అనిపిస్తోంది.
Smriti Mandhana’s Instagram story. pic.twitter.com/dBB0LZCTlp
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2025
అయితే.. పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన మంధాన తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఎక్కడ కూడా పలాశ్ ఛీట్ చేశాడనే విషయాన్ని ప్రస్తావించలేదు. తాను క్రికెట్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని మాత్రమే చెప్పింది తను. మరోవైపు పలాశ్ మాత్రం.. జనాలు వందతులను ఇట్టే నమ్మేస్తారు అని అన్నాడు. ప్రస్తుతం ఇద్దరూ ఈ బాధాకరమైన ఎపిసోడ్ నుంచి బయటపడేందుకు తమ కెరీర్‌పై ఫోకస్ పెట్టనున్నారు.
ఇటీవలే స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ముగిసిన రోజున.. ఫైనల్‌కు వేదికైన డీవై పాటిల్ స్టేడియంలోనే టీమిండియా వైస్ కెప్టెన్‌కు పలాశ్ ప్రపోజ్ చేశాడు. ఆ వెంటనే నవంబర్ 23 పెళ్లి ఫిక్స్ అయింది. భారత క్రికెటర్ల ఎంట్రీతో పెళ్లి పనులు సందడిగా షురూ అయ్యాయి. హల్దీ వేడుక, మెహందీ.. సంగీత్ డాన్స్‌లు ముగిశాయి. ఇక వివాహమే తరువాయి.. అనుకున్నవేళ ఊహించని ట్విస్ట్. మంధాన తండ్రి శ్రీనివాస్ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.
గుండెపోటు లక్షణాలతో ఆయన ఆస్పత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేసినట్టు మంధాన మేనేజర్ ప్రకటించాడు. మరునాటి నుంచి ‘పలాశ్ చీటర్’ అంటూ నెట్టింట్లో పోస్ట్‌లు వెలిశాయి. అతడికి మహిళా కొరియోగ్రాఫర్ నందికా దివేదితో అఫైర్ ఉందని వార్తలు వైరలయ్యాయి. అయితే.. అవన్నీ వదంతులని పలాశ్ కుటుంబం, సదరు కొరియోగ్రాఫర్ కొట్టిపారేసింది. కాబోయే మామ అనారోగ్యానికి గురవ్వడంతో పలాశ్ ముచ్చలే వివాహాన్ని వాయిదా వేయాలని మొదటగా నిర్ణయం తీసుకున్నాడని అతడి తల్లి చెప్పింది.
Palash Muchhal cheated Smriti Mandhana because of this choreographer girl. #SmritiMandhana pic.twitter.com/yDipbxhN7g
— BaklolCricker (@BaklolCricker) November 27, 2025
No Engagement Ring, Heavy Voice’: Smriti Mandhana’s First Post Amid Wedding Row Sparks Fans’ Concerns
The wedding of music composer Palash Muchhal and cricketer Smriti Mandhana, scheduled for November 23, was postponed a day earlier after Smriti’s father’s health deteriorated.… pic.twitter.com/qcFUe1nLGE
— Prabhakar Shanmugam (@thalaprabha21) December 6, 2025
అయినా సరే తన నమ్మకాన్ని వమ్ము చేశాడని ఇక అతడితో అనుబంధాన్ని ఆపేయాలని నిర్ణయించుకుంది మంధాన. వెంటనే పలాశ్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది ఓపెనర్. భారత క్రికెటర్లు సైతం బాలీవుడ్ సింగర్‌ను అన్‌ఫాలో చేసి.. వివాహం రద్దు వార్తలకు ఊతమిచ్చారు. అయితే.. పలాశ్ తల్లి అమిత, గాయకురాలైన సోదరి పాలక్ మాత్రం అదేం లేదు. ఇరువురి కుటుంబాలు బాధలో ఉన్నాయి. త్వరలోనే మంధాన – పలాశ్ పెళ్లికి కొత్త తేదీ ప్రకటిస్తాం. ఇద్దరి పెళ్లి జరుగుతుంది అని కామెంట్లు చేశారు. కానీ, రెండురోజుల క్రితం మంధాన ఒక వీడియో పోస్ట్‌లో నిశ్చితార్ధం ఉంగురం లేకుండా కనిపించింది. దాంతో.. త్వరలోనే వీరి పెళ్లి రద్దు వార్తను వింటామని అనుకున్నారంతా. అందరూ ఊహించినట్టే మంధాన – పలాశ్ మాత్రం పరస్పర అంగీకారంతోనే పెళ్లిని రద్దు చేసుకున్నామని ప్రకటించారు.