King Charles III |బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3కి ఓ చిన్నారి నుంచి చిలిపి ప్రశ్న ఎదురైంది. సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన ప్రాజెక్ట్ జీరో వాల్తమ్స్టోవ్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కింగ్ ఛార్లెస్ తూర్పు లండన్ వెళ్లారు. అక్కడ ఆయన్ను బార్న్ క్రాఫ్ట్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతించారు. జెండాలు ఊపుతూ ఛార్లెస్‌ను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఆ చిన్నారులతో కింగ్ ఛార్లెస్ కాసేపు సరదాగా ముచ్చటించారు. సెలవు దినాలు, భోజన సమయం వంటి కుశల ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో చిన్నారులు సైతం కింగ్‌కు పలు చిలిపి ప్రశ్నలు సంధించారు. అందులో ఓ చిన్నారి ఛార్లెస్‌ని ‘మీ వయసు ఎంత’ అని అడిగారు. దీంతో అక్కడున్నవారి ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. దీనికి ఛార్లెస్ సైతం తనదైన శైలిలో ‘గెస్ చేయండి’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బ్రిటన్ను ఏడు దశాబ్దాల పాటు పాలించిన రాణి ఎలిజబెత్-2 మరణం తర్వాత ఆమె పెద్ద కుమారుడు, యువరాజు ఛార్లెస్-3 రాజుగా బాధ్యతలు చేపట్టారు. 73 ఏళ్ల వయసులో ఈ పదవిని అలంకరించిన వ్యక్తిగా ఛార్లెస్ నూతన అధ్యాయం లిఖించారు.
First joint engagement for the King and Queen Consort in London with a visit to youth organisation @ProjectZeroWF1 King Charles keen to have a quick chat with primary school children about school lunches and school holidays on the way in pic.twitter.com/6fWx0iXV7P
— Rhiannon Mills (@SkyRhiannon) October 18, 2022