బర్త్‌డే కేకును సాధారణంగా దేనితో కట్ చేస్తారు. చాక్‌తో కట్ చేస్తారు. అది కూడా ప్లాస్టిక్ చాక్‌ను కేక్ తీసుకొచ్చిన బేకరీలోనే ఇస్తారు. దానితోనే ఎవ్వరైనా కట్ చేస్తారు. కానీ.. ఇతడు మాత్రం తన ఐఫోన్‌తో బర్త్‌డే కేక్‌ను కట్ చేశాడు. అంతే కాదు.. దాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. అడ్డంగా బుక్కయిపోయాడు. నెటిజన్లు, రాజకీయ నేతల చేతికి చిక్కాడు.
ఇంతకీ ఎవరా వ్యక్తి అంటారా? కర్ణాటకలోని కొప్పల్ బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ దాడెసుగుర్ కొడుకు. అతడి పేరు సురేశ్. తన ఫ్రెండ్స్.. సురేశ్ బర్త్ డే సందర్భంగా తన పేరులోని ఇంగ్లీష్ అక్షరాలతో కేకులను తయారు చేయించి.. తీసుకొచ్చి మనోడితో కట్ చేయించారు. తన బర్త్‌డే సెలబ్రేషన్లను బల్లారి జిల్లాలోని హోస్పేటలో నిర్వహించారు. బీఎమ్‌డబ్ల్యూ కారులో తన ఫ్రెండ్స్‌తో కలిసి బర్త్‌డే వేడుకల్లో సురేశ్ పాల్గొన్న ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే.. ఈ బర్త్‌డే కాస్త రాజకీయ రంగును పూసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ నేతలు బర్త్‌డే బాయ్ తండ్రి అయిన ఎమ్మెల్యే బసవరాజ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నెటిజన్లు కూడా ఆ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మీకు డబ్బు ఉందనే అహంకారమా? లేక పేదలను ఎగతాళి చేయడమా? ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్యామిలీ కొప్పల్ నియోజకవర్గ ప్రజలను అవమానించడమే.. అంటూ ఓ కాంగ్రెస్ నేత ఫైర్ అయ్యారు.
ఈ విషయంపై స్పందించిన ఆ ఎమ్మెల్యే కూడా తన కొడుకు చేసిన దాంట్లో తప్పేంటి.. అంటూ తన కొడుకును సమర్ధించినట్టు తెలుస్తోంది.
సురేశ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సురేశ్ తాను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తన బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ప్రస్తుతం కోవిడ్ 19 ప్రబలుతున్న నేపథ్యంలో.. చేతిని కాకుండా.. ఫోన్‌ను ఉపయోగించి కేక్ కట్ చేసి ఉంటాడు. దీంట్లో తప్పేముంది.. అని ఆ ఎమ్మెల్యే మీడియాకు తెలిపినట్లు సమాచారం.
A Karnataka BJP MLA’s son has stirred a controversy by cutting his birthday cake(s) using his iPhone pic.twitter.com/zht6HhD12X
— Soumya Chatterjee (@Csoumya21) September 3, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : ఆ ఊళ్లో మహిళలకు ఒక భాష.. పురుషులకు మరో భాష.. ఒకే ఊరిలో రెండు భాషలు
Viral Video : పళ్లతో రిబ్బన్ కట్ చేసిన మంత్రి.. వీడియో వైరల్
Sea Snake : వామ్మో.. సముద్రంలో పాములు ఇలా ఉంటాయా? వైరల్ వీడియో