Viral Video | ప్రపంచంలో ప్రముఖ కాఫీ చైన్ల ప్రస్తావన రాగానే ముందుగా అందరికీ గుర్తుకువచ్చేది స్టార్‌బక్స్. గ్లోబల్ కాఫీ చైన్ దిగ్గజం పలు రకాల కాఫీలను ఆఫర్ చేయడమే కాకుండా మెనూలో విస్తృతమైన ఫుడ్ ఐటెమ్స్ కాఫీ ప్రియులను అలరిస్తాయి. అయితే వీటి ధరలు కాస్త ఖరీదు కావడంతో చిన్న పట్టణాల్లో స్టార్‌బక్స్ అవుట్‌లెట్స్ నిలదొక్కుకోలేవనే అభిప్రాయం ఉంది. వాస్తవ పరిస్ధితి మాత్రం ఇందుకు భిన్నం అన్నట్టుగా ఇటీవల వారణాసిలో స్టార్‌బక్స్ తొలి స్టోర్ ప్రారంభించడంతో జనాలు అవుట్లెట్ ముందు బారులుతీరి కనిపించారు.
యూపీలోని వారణాసిలో స్టార్‌బక్స్ స్టోర్ ఎదుట పెద్దసంఖ్యలో ప్రజలు క్యూ కట్టిన వీడియో ప్రస్తుతం ఎక్స్ వేదికగా తెగ వైరలవుతోంది. ఎవరూ కాఫీ కోసం రూ. 300 ఖర్చు పెట్టని క్రమంలో చిన్న పట్టణాల్లో స్టార్‌బక్స్ సక్సెస్ కాదని గతంలో ప్రజలు చెబుతుండేవారు..అయితే వారణాసిలో మాత్రం..అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
People earlier : Starbucks wouldn’t succeed in small towns because nobody would buy a ₹300 coffee.
Meanwhile Varanasi : pic.twitter.com/KYfSJt1WQ3
— Aaraynsh (@aaraynsh) March 29, 2024
ఈ వీడియోలో స్టార్‌బక్స్ స్టోర్ లోపలే కాకుండా బయటకూడా పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడటం చూడొచ్చు. ఆపై స్టార్‌బక్స్ లోపల ఇంటీరియర్‌తో పాటు అక్కడ కస్టమర్లు ఎంతో సహనంతో తమ వంతు వచ్చేవరకూ వేచిచూడటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక వారణాసి ప్రజలు ఎంతో సంపన్నులని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇక వారణాసి ఎంతమాత్రం చిన్న పట్టణం కాదని ఓ యూజర్ రాసుకొచ్చారు.
Read More :