న్యూఢిల్లీ : మనలో కొందరు పాములను ప్రేమిస్తూ వాటిని పెంచుకునేందుకు మొగ్గుచూపుతుండగా మరికొందరు వాటిని చూస్తేనే బెంబేలెత్తుతారు. తాజాగా ఓ వ్యక్తి పాము నుదుటిపై ముద్దాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సౌరవ్ జాదవ్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వైరల్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో భారత వన్యప్రాణి సంరక్షకుడు, స్నేక్ ఎక్స్పర్ట్ వావ సురేష్ కనిపిస్తారు. ఈ క్లిప్‌లో సురేష్ కింగ్ కోబ్రాకు అతిదగ్గరగా మూవ్ అవుతూ స్నేక్‌ను మచ్చిక చేసుకుంటాడు.
కింగ్ కోబ్రాను మెల్లిగా సమీపించి చివరికి దాని నుదుటిపై సురేష్ కిస్ చేస్తాడు. ఈ వీడియో ఇప్పటవరకూ 16,000కు పైగా వ్యూస్‌ను రాబట్టింది. ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. కామెంట్స్ సెక్షన్లో తలోరకంగా స్పందించారు.