Bhuban Badyakar | నేను అలా మాట్లాడటం తప్పే.. క్షమాపణలు చెప్పిన ‘కచ్చా బాదమ్’ సింగర్ భుబన్
నాకు అన్నం పెట్టిన పని అది. నేను చాలా సాధారణ వ్యక్తిని. అలాగే జీవించాలని అనుకుంటున్నా. నేను జనాల దృష్టిలో సెలబ్రిటీని కావచ్చు
Bhuban Badyakar | ఇప్పుడు ప్రపంచమంతా ఒక్క కచ్చా బాదమ్ పాట గురించే మాట్లాడుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదమ్ గురించే చర్చ. పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి పాడిన కచ్చా బాదమ్ పాట వైరల్ అయింది. సెలబ్రిటీలు కూడా కచ్చా బాదమ్ పాటకు స్టెప్పులేసి ఆ వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియోకు ఒక్కసారిగా హైప్ వచ్చేసింది.
వెస్ట్ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్.. వీధి వీధి తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. పల్లీలు అమ్మే సమయంలో కచ్చా బాదమ్ అంటూ పాట పాడుతూ పల్లీలు అమ్ముకునేవాడు. ఆ వీడియో వైరల్ అవడంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయ్యాడు భుబన్.
సెలబ్రిటీ హోదా రాగానే.. ఆయన పాటిన పాటను పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కొనుగోలు చేశాయి. దీంతో భుబన్‌కు డబ్బులు కూడా బాగానే వచ్చాయి. దీంతో ఇక తాను పల్లీలు అమ్మనని.. తనకు ఇప్పుడు సెలబ్రిటీ హోదా వచ్చిందని ఆ మధ్య భుబన్ స్పష్టం చేశాడు. ఓవర్ నైట్ సెలబ్రిటీ కాగానే.. అన్నం పెట్టిన పనిని అలా ఎలా వదిలేస్తారు అంటూ నెటిజన్లు ఆయనపై గుర్రుమన్నారు. దీంతో ఇటీవల బోల్పూర్లో ఓ ఫంక్షన్లో మాట్లాడిన భుబన్.. తనకు సెలబ్రిటీ హోదా ఉన్నా కూడా పల్లీలు అమ్ముతానని చెప్పుకొచ్చాడు. అప్పట్లో పల్లీలు అమ్మనని చెప్పినందుకు అందరికీ క్షమాపణలు చెప్పాడు భుబన్.
నాకు అన్నం పెట్టిన పని అది. నేను చాలా సాధారణ వ్యక్తిని. అలాగే జీవించాలని అనుకుంటున్నా. నేను జనాల దృష్టిలో సెలబ్రిటీని కావచ్చు.. అయినా కూడా ఇదివరకు పల్లీలు అమ్మినట్టుగానే మళ్లీ పల్లీలు అమ్మడం ప్రారంభిస్తా.. అని భుబన్ చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

