మీరు సోషల్ మీడియాను రోజూ జల్లెడ పట్టేవాళ్లు అయితే ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉండాలి. అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. అనేది ఏంటో తెలిసిపోయి ఉంటుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే కదా చర్చ.
రెడ్ లేబుల్ టీ పౌడర్ కంపెనీ.. కొన్ని రోజుల కింద ఓ యాడ్‌ను చేసింది. ఆ యాడ్‌లో ఓ ట్రాన్స్‌జెండర్.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఓ కారు దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంది. ఆ ట్రాన్స్‌జెండర్‌ను చూసి కారులో కూర్చున్నపెద్దావిడ.. విసిగించడానికి వస్తారు ఎక్కడి నుంచో అని కారు గ్లాస్ తీసి 10 రూపాయలు ఇవ్వబోతుంది. అయ్యయ్యో వద్దమ్మా.. ఈ పక్కనే నా టీకొట్టు ఉందమ్మా.. అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నాను.. అని చెప్పి టీ తెచ్చి ఇస్తుంది. ఆ టీ పెద్దావిడకు నచ్చడంతో ఇలా రా ఒకసారి అని పిలిచి డబ్బులు ఇవ్వబోతుంది. అయ్యయ్యో వద్దమ్మా ఈరోజు డబ్బులు తీసుకోను అంటుంది. డబ్బులు ఇవ్వడం లేదు కానీ.. సుఖీభవ.. అంటుంది పెద్దావిడ. బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్.. మమకారపు మాధుర్యం.. అంటూ యాడ్ ముగుస్తుంది.
నిజానికి ఈ యాడ్ వచ్చి ఆరు నెలలు దాటింది. కానీ.. ఈ యాడ్ అంతగా ఫేమస్ కాలేదు. ఎప్పుడైతే.. హైదరాబాద్‌కు చెందిన డ్యాన్సర్ శరత్.. ఓరోజు పెళ్లి డ్యాన్స్‌లో భాగంగా డ్యాన్స్ వేస్తూ సరదాగా.. అయ్యయ్యో వద్దమ్మా.. అ పక్కనే నా టీకొట్టు ఉంది. అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నాను.. సుఖీభవ.. సుఖీభవ.. అంటూ పాటపాడి తీన్మార్ స్టెప్పులు వేస్తాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అవడమే కాదు.. శరత్.. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
శరత్ అన్న మాటలతో మీమ్స్ విపరీతంగా క్రియేట్ అవుతున్నాయి. కొందరిని అవే వ్యాఖ్యలు ఉపయోగించి నెటిజన్లు.. ట్రోల్ కూడా చేస్తున్నారు. ఈ విషయం చివరకు హైదరాబాద్ సిటీ పోలీసు, సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా తెలిసిపోయింది. దీంతో సైబర్ నేరాలపై నగర వాసులను ఎడ్యుకేట్ చేయడం కోసం ట్రెండింగ్‌లో ఉన్న అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. అనే పదాలను వాడుకున్నారు.
మీరు బహుమతి గెలుచుకున్నారు.. అభినందనలు.. ఈ అవార్డును పొందడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. అంటూ వచ్చే మెసేజ్‌లను నమ్మకండి. వాటికి అయ్యయ్యో వద్దమ్మా.. అనేసేయండి.. అంటూ హైదరాబాద్ సిటీ, సైబర్ క్రైమ్ పోలీసులు ఫన్నీగా ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి…. #సుఖీభవ #sukhibhava #cybersafety #yoursafetyisourfirstpriority pic.twitter.com/1GZ2zAbl59
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) September 23, 2021
# అలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి….
— Telangana Cyber Crime Coordination Centre (T4C) (@TSPCybercrime) September 24, 2021
#సుఖీభవ #sukhibhava #cybersafety #yoursafetyisourfirstpriority@CyberCrimeRck @cyberabadpolice @hydcitypolice pic.twitter.com/07kbWn9Pu3
E video monnatnunchi chusthunna ..navvu agatla 😂#Sukhibhava pic.twitter.com/cJljiuHrhY
— 𝗞𝗹𝗮𝘂𝘀 𝗠𝗶𝗸𝗲𝗮𝗹𝘀𝗼𝗻 😎 (@Klaus0509) September 20, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Viral Video : డేంజరస్ స్పైడర్‌తో చిన్నారి ఆటలు.. వెంటనే పాప తండ్రి ఏం చేశాడంటే?
Ratan Tata : తాజ్ హెటల్ ఉద్యోగి చేసిన ఆ పనికి రతన్ టాటా ఫిదా.. ఫోటో వైరల్
Divorce Party : భర్తతో విడాకులు తీసుకొని.. డైవర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న మహిళ
Viral Video : కొడుకు పుట్టిన ఆనందంలో తొలిసారి బాబును ఎత్తుకొని ఈ తండ్రి ఏం చేశాడో చూడండి