ఇటీవలే కదా.. ఓ వ్యక్తి పానీపూరీ నీళ్లలో మూత్రం పోయడం చూసి యాక్.. ఛీ అని అనుకున్నాం. అలాంటి ఘటనలు రోజూ చాలానే జరుగుతున్నా ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నది. తాజాగా ఓ దాబాలో తందూరీ రోటీ చేసే ఓ వ్యక్తి రోటీ చేస్తూ ఏం చేశాడో చూస్తే ఛీ.. యాక్ అంటారు. ఈ ఘటన ఘజియాబాద్ లోని ఓ దాబాలో చోటు చేసుకుంది.
చికెన్ పాయింట్ అనే దాబాలో తందూరీ రోటీలు చేస్తున్న ఓ వృద్ధుడు.. వాటిపై ఉమ్మి వేశాడు. పలుమార్లు రోటీలపై ఉమ్మి వేస్తూ వాటిని తయారు చేస్తుండగా.. ఆ ఘటనను దాబాకు వచ్చిన ఓ కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బీహార్ లోని కిషన్ గంజ్ కు చెందిన తామిజుద్దీన్ గా అతడిని గుర్తించారు. ఈ వీడియో పోలీసులకు తెలియడంతో వెంటనే ఆ దాబాకు వెళ్లిన పోలీసులు తామిజుద్దీన్ ను అరెస్ట్ చేసి అతడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు ఎన్ని వెలుగులోకి వచ్చి.. వాళ్ల మీద ఎన్ని యాక్షన్లు తీసుకుంటున్నా.. ఇటువంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు.
गाजियाबाद के एक चिकन पॉइंट का वीडियो सामने आया है, जिसमें एक शख्स थूक लगाकर रोटी बनाता दिख रहा है. pic.twitter.com/utDi9Jh9F8
— Anubhav Veer Shakya (@AnubhavVeer) October 17, 2021
ఫిబ్రవరి 2021 లో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో కూడా ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఢిల్లీలోనూ సేమ్ ఇదే ఘటన చోటు చేసుకుంది.
थूककर रोटी बनाई…!
— Anamika Jain Amber (@anamikamber) February 21, 2021
कोविड जैसी भयावह बीमारी खत्म भी नही हुई और इस प्रकार की मानसिकता वाले लोग अपनी जाहिलीयत दिखाने से नही चूके।
फिर @meerutpolice ने पकड़ा इन्हें। pic.twitter.com/9CQlLEPRmX
Sabi Anwar and Ibrahim arrested from West Delhi for spitting on roti meant for selling and also remember islamophobia is growing in world for no reason. https://t.co/8cbb6jRwB5
— Enemy Slayer (@EnemySlayer24_7) March 18, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
6 కిలోల శిశువుకు జన్మనిచ్చిన మహిళ.. పుట్టగానే ఆ పిల్లాడు ఎలా ఉన్నాడో చూడండి
Squid Game Parody : స్క్విడ్ గేమ్ పేరడీ వీడియో చూశారా? చూస్తే నవ్వు ఆపుకోలేరు