Supreme Court | నిందితుల ఫొటోలు ఆన్లైన్లో ఉంచుతారా?పోలీసులు, ప్రజల తీరుపై సుప్రీం కోర్ట్ అభ్యంతరం
మొబైల్ ఫోన్లలో చిత్రించిన వీడియోలను ప్రజలు వెంటనే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే ధోరణి పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది.
- ఇలాంటి చర్యలు విచారణకు ముప్పుగా మారుతున్నాయి
- పోలీసులు, ప్రజల తీరుపై సుప్రీం కోర్ట్ అభ్యంతరం
న్యూఢిల్లీ, మార్చి 21: మొబైల్ ఫోన్లలో చిత్రించిన వీడియోలను ప్రజలు వెంటనే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే ధోరణి పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు పారదర్శక విచారణకు ముప్పుగా మారుతుందని పేర్కొంది. నిందితుల ఫొటోలు, వీడియోలను పోలీసులు సామాజిక మాధ్యమంలో విడుదల చేస్తుండటంతో అది ప్రజల మనస్సుల్లో వారిపట్ల వ్యతిరేక భావన కలిగిస్తున్నదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐతో కూడిన ధర్మాసనం విచారించింది. పోలీసులు మీడియాకు తెలియజేసే వివరాలకు సంబంధించి అన్ని రాష్ర్టాలకు సుప్రీం కోర్టు గతంలోనే కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని సామాజిక మాధ్యమాలకు కూడా వర్తింప జేయాలని పిటిషనర్ కోరారు. ఈ సందర్భంగా నిందితులకు బేడీలు వేసి ఉన్నవి, తాళ్లతో కట్టి ఉన్నవి, అర్ధనగ్నంగా నడిపిస్తున్నవి, బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి ఉన్న చిత్రాలను పోలీసులు పోస్ట్ చేస్తున్న ట్రెండ్ పెరిగిపోయిందని, ఇది ఆయా వ్యక్తుల గౌరవానికి భంగం కలిగిస్తున్నదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

