Haryana | హర్యాణాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ద్విచక్ర వాహనం ఎక్కలేదన్న అక్కసుతో ఓ వ్యక్తి.. మహిళను హెల్మెట్‌తో చితకబాదాడు. ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
రాత్రి సమయంలో ఆటో వచ్చి గురుగ్రామ్‌లోని ఓ ప్రాంతంలో ఆగుతుంది. అందులో నుంచి ఓ మహిళ కిందకు దిగుతుంది. ఆ సమయంలో తన ఇంటికి సమీపంలో ఉండే కమల్ అనే వ్యక్తి బైక్‌పై అక్కడికొస్తాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఈ మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ.. కమల్ బైక్‌ను పక్కకు ఆపి ఆమెపై చేయి చేసుకుంటాడు. హెల్మెట్‌తో దారుణంగా కొడతాడు. దీంతో ఆటో డ్రైవర్, స్థానికులు కమల్‌ను అడ్డుకుంటారు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ఏసీపీ మనోజ్ తెలిపారు. మహిళ తన బైక్ ఎక్కలేదన్న కోపంతోనే కమల్ ఇలా ప్రవర్తించిట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | Haryana: CCTV footage of a man named Kamal hitting a woman with his helmet after she refused to ride on his bike. pic.twitter.com/Az3MWRKKWo
— ANI (@ANI) January 6, 2023