Gali Janardhana Reddy | తనపై జరిగిన హత్యాయత్నంపై గాలి జనార్దన్ రెడ్డి స్పందించారు. బళ్లారిలోని హవంబావీ సమీపాన బ్యానర్ విషయంలో ఘర్షణ జరిగిందని తెలుసుకుని వచ్చానని తెలిపారు. ఆ సమయంలో తనపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని చెప్పారు. ఇప్పుడు వాల్మీకి విగ్రహం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రయత్నించారని ఆరోపించారు. భరత్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి పెద్ద నేరస్తుడు అని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీల సామ్రాజ్యాన్ని నిర్మిస్తోందని మండిపడ్డారు.
బళ్లారిలో వాల్మీకి విగ్రహావిష్కరణ సందర్భంగా బ్యానర్ల తొలగింపు విషయంలో గురువారం రాత్రి ఘర్షణ నెలకొంది. బళ్లారి అర్బన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. అది కాస్త ఉద్రిక్తతలకు దారితీయడంతో గన్మెన్ తుపాకి లాక్కొని భరత్ రెడ్డి అనుచరుడు సతీశ్ రెడ్డి కాల్పులకు తెగబడ్డాడు. గాలి జనార్దన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల దాడి నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. అనంతరం ప్రతిఘటించిన జనార్దన్ రెడ్డి అనుచరులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతిచెందాడు. సతీశ్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది.
దీంతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాలి జనార్దన్ రెడ్డి, భరత్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవలు తీవ్రంగా మారడంతో అక్కడకు వచ్చిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో గాలిలో కాల్పులు జరిపారు.
Janardhan Reddy Incident : ನನ್ನ ಹತ್ಯೆ ಯತ್ನ ನಡೆದಿದೆ ಎಂದ ಜನಾರ್ದನ ರೆಡ್ಡಿ | Ballari
WATCH #RepublicKannada LIVE: https://t.co/c4LtlT6bHu#janardhanreddy #ballari #ballarinews #karnataka #bjp #karnatakabjp #cmsiddaramaiah #gparameshwara #republickannada pic.twitter.com/OGITq9w8Vb
— Republic Kannada (@KannadaRepublic) January 1, 2026