Gali Janardhana Reddy | కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్లారిలోని హవంబావీ ప్రాంతంలో ఆయన ఇంటి వద్దే కాల్పులు జరిగాయి. బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీశ్ రెడ్డినే ఈ కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఈ కాల్పుల నుంచి గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు.
మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీపై చెలరేగిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే గన్‌మెన్ తుపాకి లాక్కున్న సతీశ్ రెడ్డి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రతిఘటించిన జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతిచెందగా.. సతీశ్ రెడ్డికి బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బళ్లారిలో గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం..
ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడి కాల్పులు
గన్‌మన్ తుపాకీ లాక్కుని రెండు రౌండ్ల కాల్పులు జరిపిన సతీష్‌రెడ్డి
తప్పించుకున్న మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి..
ఇరువర్గాల పరస్పర కాల్పులు, ఒకరు మృతి, సతీష్‌కు గాయాలు..
మహర్షి… pic.twitter.com/sksSA8k3eb
— greatandhra (@greatandhranews) January 2, 2026