Hyderabad Fog | హైదరాబాద్ శివార్లను కమ్మేసిన పొగమంచు.. బెంగళూరు హైవేపై 10 కి.మీ. మేర నిలిచిన వాహనాలు
Hyderabad Fog | హైదరాబాద్ శివారు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు కమ్మేయడంతో రోడ్లు, భవనాలు ఏమీ కనిపించకుండా ఉంది.
Hyderabad Fog | హైదరాబాద్ శివారు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు కమ్మేయడంతో రోడ్లు, భవనాలు ఏమీ కనిపించకుండా ఉంది. దీంతో నగర శివారు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవే, మేడ్చల్, తూంకుంట, శామీర్‌పేట, ఆదిబట్ల, గండిపేట, మోకిల, పటాన్చెరు, వికారాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గాల్లో జీరో విజిబిలిటీ ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో రోడ్డు పక్కన వాహనాలను నిలిపివేసుకున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పొగమంచు కమ్ముకోవడంతో రహదారి పక్కకు వాహనాలను నిలిపివేశారు. పొగమంచు కారణంగా ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద పది అడుగుల దూరంలోని వాహనాలు కూడా కనిపించనంతగా పొగమంచు కుమ్ముకుంది. దీంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించడం లేదు. విజిబిలిటీ లేకపోవడంతో లైట్ల వెలుతురులో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Dense #fog hits Hyderabad outskirts; #flights disrupted
Low visibility at @RGIAHyd
Airport, #Shamshabad led to the cancellation of an @airindia #Delhi–Hyderabad flight, while an @IndiGo6E Hyderabad–#Tirupati flight was delayed.Fog blanketed #Rajendranagar,… pic.twitter.com/tXO2cy680Q
— NewsMeter (@NewsMeter_In) January 2, 2026
#WATCH | Telangana: Amid an intensifying cold wave, a layer of fog engulfed the city of Hyderabad this morning. pic.twitter.com/3j5D7Qvwgi
— ANI (@ANI) January 2, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

