Elephant | ఏనుగుకు కోపమొస్తే అదుపుచేయడం ఎవరి తరమూ కాదు. వీరంగం సృష్టిస్తూ.. అడ్డొచ్చిన వారిని తొండంతో ఈడ్చేస్తుంది. తన బలమైన కాళ్లతో తొక్కిపారేస్తుంది. దానికి కోపమొచ్చేలా ప్రవర్తించామో అంతే సంగతులు వెంటపడి మరీ తరుముతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇద్దరు యువకులు వారి సమీపంలోకి వస్తున్న ఏనుగుల గుంపును అదుపు చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు తన వద్ద ఉన్న పొడవాటి కర్రతో ఏనుగును కొడతాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ గజరాజు ఒక్కసారిగా యువకులపైకి దూసుకొస్తుంది. దీంతో వారు ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులు తీస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సురేంద్ర మెహ్రా ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘ఇదోరకమైన పిచ్చి..’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు.. యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Just madness…🐘#Wildlife #conflict @susantananda3
pic.twitter.com/Il8jx4AqgZ— Surender Mehra IFS (@surenmehra) December 4, 2022